సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులది

ABN , First Publish Date - 2021-07-25T05:34:06+05:30 IST

సంగం డెయిరీ అనేది పాల ఉత్పత్తిదారులదని సంగం డెయిరీ చైర్మన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు.

సంగం డెయిరీ పాల ఉత్పత్తిదారులది

బొల్లా వ్యాఖ్యలను ఖండించిన ధూళిపాళ్ల

వినుకొండ, జూలై 24: సంగం డెయిరీ అనేది పాల ఉత్పత్తిదారులదని   సంగం డెయిరీ చైర్మన ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ సంగం డెయిరీ చైర్మన ధూళిపాళ్ల శనివారం వినుకొండ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.  పది మంది కలిసి పెట్టుకునేదే సంఘం అని, ఈ విషయం కూడా ఎమ్మెల్యేకు తెలియకపోవడం దౌర్భాగ్యమన్నారు. రైతుకు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ తోడుగా ఉండటానికి తన తండ్రి వీరయ్యచౌదరి సంగం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బొల్లా ఎలా సంపాధించారన్నది అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలుసని, మాకు మీలా సంపాదించడం తెలియదన్నారు. పేదలమీద పడి దోచుకోవడం, రాజకీయ వ్యాపారం చేసుకోవడం తనకు రాదని, వినుకొండ పారంతాల్లో సంగం డెయిరీని నమ్ముకొని తమతో ఉన్న రైతులు ఆర్థికంగా బలపడాటానికి కృషిచేస్తామని తెలిపారు. ఇప్పటికీ కూడా సంగం డెయిరీపై ప్రజలకు మమకారం ఉందని తెలిపారు. 


Updated Date - 2021-07-25T05:34:06+05:30 IST