దుల్కర్‌ ముగించారు

Jul 28 2021 @ 04:28AM

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా రోషన్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళ చిత్రం ‘సెల్యూట్‌’. వారం రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందంతో కలసి దిగిన ఫొటోను దుల్కర్‌ సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నారు. పోలీస్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్‌ ఎస్సై అరవింద్‌ కరుణాకరన్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి డయానా పెంటీ కథానాయిక. ఈ చిత్రాన్ని దుల్కర్‌ నిర్మిస్తున్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.