నిన్న మమ్ముట్టి.. నేడు దుల్కర్..

Published: Thu, 20 Jan 2022 21:00:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిన్న మమ్ముట్టి.. నేడు దుల్కర్..

సెలబ్రిటీలను కరోనా వెంటడుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఒకరి తర్వాత మరొకరు కోవిడ్ బారీన పడుతున్నారు. కమల్ హాసన్, విక్రమ్, త్రిష, ఖుష్భూ తదితరులందరు కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో చేరారు. దుల్కర్ సల్మాన్‌ కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలారు. ఆ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.


‘‘నేను కోవిడ్‌కు పాజిటివ్‌గా తేలాను. ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికి కొద్దిపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. కొద్ది పాటి లక్షణాలు ఉన్నప్పటికి కూడా ఐసోలేషన్‌లో ఉండాలి’’ అని దుల్కర్ సల్మాన్ ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. తమ అభిమాన హీరో కోవిడ్ బారీన పడటంతో త్వరగా కోలుకోవాలని అభిమానులందరూ ప్రార్థిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దుల్కర్ తండ్రి మమ్ముట్టి కూడా కరోనా బారీన పడ్డారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International