యూఏఈలోని 64 మంది భారతీయులకు అండగా సామాజిక కార్యకర్త

ABN , First Publish Date - 2021-04-22T18:43:28+05:30 IST

ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన దాదాపు 64 మంది భారతీయులకు సామాజిక కార్యకర్త శిరాలి షేక్ ముజాఫర్ అండగా నిలిచారు. వారి సమస్యను యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ అధికారుల దృష్టికి తీసుకె

యూఏఈలోని 64 మంది భారతీయులకు అండగా సామాజిక కార్యకర్త

అబుధాబి: ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన దాదాపు 64 మంది భారతీయులకు సామాజిక కార్యకర్త శిరాలి షేక్ ముజాఫర్ అండగా నిలిచారు. వారి సమస్యను యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వారికి పాస్‌పోర్ట్‌లను ఇప్పించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. యూఏఈలో ఉద్యోగం పేరుతో కొందరు ఏజెంట్లు.. యూపీ, బిహార్, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన సుమారు 64 మంది నుంచి దాదాపు రూ.1.50లక్షలను వసూలు చేశారు. తర్వాత వారిని విజిట్ వీసాపై యూఏఈ పంపించారు. ఈ క్రమంలో యూఏఈ చేరిన 64 మంది నుంచి సదరు ఏజెంట్ల మనుషులు పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకుని వారికి ఎటువంటి ఉద్యోగాన్ని చూపకుండా షార్జాలోని ఓ గదిలో బంధించారు. ఈ నేపథ్యంలో తాము మోసపోయినట్టు 64 మంది భారతీయులు గ్రహించారు.



కాగా.. ఈ విషయం సామాజిక కార్యకర్త శిరాలి షేక్ ముజాఫర్ దృష్టికి వచ్చింది. దీంతో యూఏఈలోని ఇండియన్ కాన్సులేట్ అధికారులను సంప్రదించి విషయాన్ని తెలిపారు. అంతేకాకుండా సదరు ఏజెంట్ల మనుషుల దగ్గర నుంచి ఆ 64 మంది పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకుని వారికి అందించారు. స్వదేశానికి తిరిగి రావడానికి ఇష్టపడుతున్న వారికి అండగా నిలిచి.. వారి ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చూస్తున్నారు. ఈ క్రమంలో స్పందించిన శిరాలి షేక్ ముజాఫర్.. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారిలో దాదాపు 20 మంది యూఏఈలో పని చేసేందుకు ఆసక్తి చూపించినట్టు తెలిపారు. అనుభవం ఉన్న రంగంలో వారిని పనిలో పెట్టించేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 


Updated Date - 2021-04-22T18:43:28+05:30 IST