శాకంబరిగా దుర్గాదేవి

Published: Tue, 18 Jan 2022 00:41:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శాకంబరిగా దుర్గాదేవి

హుజూర్‌నగర్‌ , జనవరి 17 : పట్టణంలోని కనకదుర్గాదేవి దేవాలయంలో సోమవారం పుష్యశుధ్య పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. రెండు దశాబ్దాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు కుంకుమ పూజలు, లలితసహస్ర పారాయణం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు నరగిరినాథుని రంగభట్టాచార్యులు, రాఘవచార్యులు, వంశీ, మోహన్‌దత్తు, కొండయ్య, గిరిబాబు, ఫణిరాంరెడ్డి, రాము, భిక్షం పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.