వైభవంగా దుర్గాదేవీ నిమజ్జనోత్సవం

ABN , First Publish Date - 2021-10-17T06:21:33+05:30 IST

జగిత్యాల జిల్లా కేంద్రలోని దుర్గాదేవి నిమజ్జన వేడుకల కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా దుర్గాదేవీ నిమజ్జనోత్సవం
ధర్మపురిలో శోభాయాత్రలో పాల్న్గొన్న భక్తులు

- భారీగా పాల్గొన్న భక్తులు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 16 : జగిత్యాల జిల్లా కేంద్రలోని దుర్గాదేవి నిమజ్జన వేడుకల కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. నవదుర్గ సేవా సమితి, జయదుర్గ, కనక దుర్గ తదితర దుర్గాదేవిలను భక్తులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో నిమజ్జనానికి తరలించారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు దావ వసంత, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణిలు హాజరై దుర్గా మాతల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పు ళ్లు, మేళతాళాల మధ్య దేవీ నిమజ్జన వేడుకలు అం బరాన్నంటాయి. యువకులు నృత్యాలు చేయగా, మహిళలు కోలాటాలు వేస్తూ దుర్గాదేవిలను జగిత్యాల పట్టణ శివారులో ఉన్న కాకతీయ కాలువ, చింతకుంట చెరువు, కండ్లపెల్లి, మోతె, లింగంపేట చెరువులో నిమజ్జనం చేశారు.

- ధర్మపురి: ధర్మపురి మండలంలో దుర్గాదేవి నిమ జ్జన వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆయా దేవాలయాల నుంచి మంగళ వాయిద్యాలు వెంటరాగా వేద బ్రాహ్మణులు, నవదుర్గా సేవా సమితి సభ్యు లు, భక్తులు అమ్మవారలను ఊరేగింపుగా తీసుకెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. శ్రీ రామలింగేశ్వ ఆలయంలో ప్రతిష్టించిన దుర్గాదేవికి ముగింపు హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.   


Updated Date - 2021-10-17T06:21:33+05:30 IST