ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం

ABN , First Publish Date - 2021-06-21T21:28:29+05:30 IST

దుర్గగుడి పాలకమండలి సొమవారం సమావేశం అయింది. ఈ సమావేశం కొద్దిసేటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.

ముగిసిన దుర్గగుడి పాలకమండలి సమావేశం

విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సొమవారం సమావేశం అయింది.  ఈ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ బేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు మీడియాకు వివరించారు. 43 ఆంశాల్లో పలు అంశాలను అమోదించాం.. మిగిలినవి కమిషనర్ అనుమతికి పంపామన్నారు. భేటీలో భక్తులకు పెద్ద పీట వేశామని తెలిపారు. సీఎం జగన్ దుర్గగుడి అభివృద్ధికి ఇస్తామన్న 70 కోట్ల నిధులపై చర్చించామన్నారు. కొండపై చేపట్టబోయే అభివృద్ధి పనుల మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నిత్యన్నదాన మండపం, లడ్డూ పోటు, మరికొన్ని అభివృద్ధి పనుల కట్టడాలను దసరా నాటికి ప్రారంభిస్తామని తెలిపారు. ఇంద్రకీలాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు పాలకమండలి కృషి చేస్తుందన్నారు. నెలాఖరు నుంచి దుర్గమ్మ దర్శన వేళలను పెంచామన్నారు. జులైలో నిత్యన్నదానం పునరుద్ధరిస్తామని చెప్పారు. మాడపాటి గెస్ట్ హౌస్ తో పాటు సీపీరెడ్డి ఛారిటీస్, దేవస్ధానం రూమ్స్‌లో ధరలను తగ్గించామన్నారు. ఏసీబీ ఆరోపణలతో సస్పెండైన ఉద్యోగులను వెనక్కి తీసుకొనే అంశంపై.. లీగల్‌గా పరిశీలిస్తున్నామని సోమినాయుడు తెలిపారు. 


దుర్గమ్మ దర్శన వేళలను పెంచాం: ఈవో భ్రమరాంబ

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శన వేళలను పెంచామని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు.  ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5.30 వరకు దర్శనానికి భక్తులకు అనుమతినిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. కొవిడ్ దృష్ట్యా పరోక్ష సేవలు మాత్రమే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రత్యక్ష సేవలకు దేవాదాయశాఖ అనుమతులు రాగానే అనుమతిస్తామన్నారు. కొవిడ్ ద‌ృష్ట్యా అమ్మవారి ఆదాయం గణనీయంగా తగ్గిందని చెప్పారు. నెలకు 5 కోట్లు రావాల్సిన ఆదాయం కోటి రూపాయలు మాత్రమే వచ్చిందని ఈవో భ్రమరాంబ తెలిపారు. 

Updated Date - 2021-06-21T21:28:29+05:30 IST