దుర్గమ్మకు వెండి పంచ హారతులు

ABN , First Publish Date - 2021-08-03T05:59:10+05:30 IST

దుర్గమ్మకు వెండి పంచ హారతులు

దుర్గమ్మకు వెండి పంచ హారతులు

12 కేజీల వెండితో చేయించిన తూర్పుగోదావరి జిల్లా భక్తుడు 

విజయవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు రోజూ ప్రదోషకాలంలో నిర్వహించే పంచహారతుల సేవలో ఉపయోగించేందుకు తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ఎన్‌వీఎస్‌ఎస్‌ రెడ్డయ్య సుమారు 12 కేజీల వెండితో  పంచహారతులను తయారు చేయించి ఇచ్చారు. ఓం హారతి (కేజీ 950 గ్రాములు), పంచ హారతి (కేజీ 48 గ్రాములు), కుంభ హారతి (కేజీ 395 గ్రాములు), నక్షత్ర హారతి (రెండు కేజీల 194 గ్రాములు), నాగ హారతి (రెండు కేజీల 515 గ్రాములు), సింహ హారతి (రెండు కేజీల 128 గ్రాములు), శ్రీచక్రం పీట (515 గ్రాములు).. మొత్తం కలిపి 11 కేజీల 745 గ్రాముల వెండితో తయారు చేయించారు. వీటిని సోమవారం దేవస్థానం అధికారులకు అందజేశారు. 

Updated Date - 2021-08-03T05:59:10+05:30 IST