ఘనంగా దుర్గమ్మ నిమజ్జన శోభాయాత్రలు

ABN , First Publish Date - 2022-10-08T05:38:10+05:30 IST

దుర్గాదేవి నిమజ్జన శోభయాత్రను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా దుర్గమ్మ నిమజ్జన శోభాయాత్రలు
భువనగిరిలో నిమజ్జన శోభాయాల్రో పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు

 భువనగిరిలో  స్వల్ప ఉద్రిక్తత..లాఠీ చార్జ్‌ 

భువనగిరి టౌన, అక్టోబరు 7: దుర్గాదేవి నిమజ్జన శోభయాత్రను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలను  గత రెండు రోజులుగా స్థానిక పెద్ద చెరువులో నిమజ్జన చేస్తున్నారు. శుక్రవారం కూడా అమ్మవారి విగ్రహాల నిమజ్జనం కొనసాగింది. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి దాటాక కొనసాగిన స్థానిక ఆజాద్‌రోడ్‌లోని శ్రీ రామ భక్తభజన మండలి నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత నెలకొన్నది. ఊరేగింపును త్వరితగతిన పూర్తి చేయాలని పోలీసులు సూచించినప్పటికీ భక్తులు మాత్రం యధావిధిగా శోభాయాత్రను కొనసాగించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు నెలకొని పోలీసుల లాఠీచార్జీకి దారి తీసింది. దీంతో భక్తులు రహదారి మధ్యలోనే అమ్మవారిని ప్రతిష్టించిన శకటాన్ని నిలిపివేసి పరుగులు తీశారు. గమనించిన స్థానికులు భక్తులకు మద్దతుగా వచ్చి లాఠీచార్జి చేయడం పట్ల నిరసన తెలుపుతూ శకటం ముందు బైఠాయించారు. చివరికి పలువురి ప్రమేయంతో యధావిధిగా నిమజ్జన యాత్ర కొనసాగించి అమ్మవారిని చెరువులో నిమజ్జనం చేశారు. అలాగే శ్రీ రాంతడాక్‌ భక్తభజన మండలి, హెచబి కాలనీ యూత అసోసియేషన తదితర మండపాల ఊరేగింపేలో సాంస్కృతిక ప్రదర్శనలు, భజను, భక్తిగీతాలు అందరిని పరవశింపజేశాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  

భూదానపోచంపల్లి: పట్టణంలోని దుర్గా కమిటీ ఆధ్వర్యంలో 31వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అమ్మవారి నిమజ్జనోత్సవ కార్యక్రమాలు నేత్ర పర్వంగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ ప్రతిమకు యాదాద్రి-భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గామాత శక్తి స్వరూపమని, నేటి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, నిజమైన శక్తి స్వరూపాలుగా మారాలని కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. దుర్గాదేవి నిమజ్జనోత్సవం వైభవోపేతంగా సాగింది. చండీహోమం, మహానైవేద్య నివేదన, కుంభహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఉత్సవాల్లో డీసీసీ ఉపాధ్యక్షుడు సామ మధుసూదనరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తడక వెంకటేష్‌, మండల కమిటీ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, పట్టణ అధ్యక్షుడు గునిగంటి రమే్‌షగౌడ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన సామ మోహనరెడ్డి, దుర్గా కమిటీ గౌరవాధ్యక్షులు బోగ స్వామి, గౌరవ సభ్యులు బోగ చంద్రశేఖర్‌, పొట్టబత్తిని బాలనర్సింహ, అధ్యక్షుడు దోర్నాల మధుసూదన, సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు నాయకులు భారత వాసుదేవ్‌, సూరపల్లి రమేష్‌, భారత లవకుమార్‌, మెరుగు శశికళ పాల్గొన్నారు.  


Updated Date - 2022-10-08T05:38:10+05:30 IST