ముగిసిన దసరా ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-17T05:02:06+05:30 IST

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం విజయదశమి తో అంగరంగ వైభవంగా ముగిసాయి.

ముగిసిన దసరా ఉత్సవాలు
ప్రొద్దుటూరు గ్రామోత్సవంలో అమ్మవారు

ప్రొద్దుటూరు రూరల్‌/టౌన్‌, అక్టోబరు 16: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం విజయదశమి తో అంగరంగ వైభవంగా ముగిసాయి.  సిరిసంపద లు, విజయానికి, శుభాలకు చిహ్నమైన శమీ వృక్షా న్ని విజయదశమి రోజు దర్శించుకోవడం వలన శు భం జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇందులో భాగంగా అమ్మవారిశాలలో వాసవీ మాత ఉత్సవ మూర్తిని బంగారు ఆభరణాలతో అలంకరించి కొర్రపాడురోడ్డులోని వాసవీ శమీ వృక్ష మండపం వద్ద కు ఊరేగింపుగా తీసుకెళ్లి శమీ దర్శనం చేయించా రు. అలాగే శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమి టీ, చెన్నకేశవస్వామి ఆలయం, రాజరాజేశ్వరీదేవి ఆలయం, సూపర్‌బజార్‌రోడ్డులోని చౌడేశ్వరీదేవి ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయం, ఆత్మారామస్వామి ఆలయం ఉత్సవ కమిటీల నిర్వాహకులు కొర్రపాడు రోడ్డులోని శమీ ఉత్సవం వద్ద అమ్మవార్లకు దర్శనం చేయించారు. కేరళ సిరగారిమేళం, బా ణసంచా పేలుళ్లు, డిస్కో లైటింగ్‌, రంగు రంగుల విద్యుద్దీపాల వెలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. భక్తులు దారి పొడవునా అమ్మవారికి కాయాకర్పూరం సమర్పించి భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు.

కన్నుల పండువగా తొట్టి మెరువణి

ప్రొద్దుటూరు పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో వాసవీమాత విజయలక్ష్మిదేవి అలంకారంలో తొట్టిమెరువని కన్నుల పండువగా నిర్వహించారు. హంస రథ వాహనంపై అమ్మవారిని ఆశీనులను చేసి వాసవీ నామస్మరణల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. రంగు రంగుల బాణసం చా పేలుళ్లు భక్తులకు కనువిందు చేశాయి. అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో పట్ట ణ వీధులు కిటకిటలాడాయి.  కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు బుశెట్టి రామమోహన్‌రావు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ రవీంద్రబాబు, ఆర్యవైశ్య సభ సభ్యులు  పాల్గొన్నారు. బొల్లవరం ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించా రు. ఆలయ ఛైర్మన్‌ గోన ప్రభాకర్‌రెడ్డి, ఆలయ అభి వృద్ధి ఛైర్మన్‌ బొగ్గారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఘనంగా వసంతోత్సవం

పురవీధుల్లో వాసవీమాత గ్రామోత్సంలో దారి వెం ట వసంతోత్సవంగా రంగులు చల్లుతూ భక్తులు ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు. 

పాన్పు సేవతో ముగిసిన  ఉత్సవాలు

జమ్మలమడుగు రూరల్‌, అక్టోబరు 16: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు  శుక్రవారం రాత్రి శ్రీ మత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారి పాన్పు సేవతో ఉత్సవాలు వైభవంగా ముగిసాయి. అంతకు ముందు ఉదయం భక్తులు  వాసవీ మాతని  దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పట్టణంలోని శ్రీమదాంబ అంబాభవానీ ఆలయంలో, నాగులకట్ట  చౌడేశ్వరీదేవి ఆలయంలో,  ఆర్టీసీ బస్టాండు ప్రస న్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో, కన్యలూరులోని చౌడేశ్వరీదేవి, ముద్దనూరు రోడ్డులోని సాయిబాబా ఆలయం రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.  కాగా శ్రీమత్కన్యకాపరమేశ్వరీదేవి అమ్మవారిని వసంతోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి మెయిన్‌బజార్‌, మార్కెట్‌వీధి మీదుగా అమ్మవారి ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్యవైశ్యులు , భక్తులు రంగులు చల్లుకున్నారు. దసరా పండుగను పురష్కరించుకుని పట్టణంలో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో వాసవీమాత ఆలయ కమిటీవారు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

దసరా పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, హ్యాండీక్రాప్ట్‌ ఛైర్మన్‌ బడిగించల విజయలక్ష్మిలు కన్యకాపరమేశ్వరీదేవిని, అంభాభవానీ,  చౌడేశ్వరీ అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భం ఎమ్మెల్యేను ఆలయ  కమిటీవారు ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షులు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, బడిగించల చంద్రమౌళి పాల్గొన్నారు.


వైభవంగా శమీ దర్శనం

రాజుపాళెం, అక్టోబరు 16: పుణ్యక్షేత్రమైన  చెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వరస్వామి దేవస్థానా ల్లో శుక్రవారం విజయదశమి సందర్భంగా శమీ దర్శనం వైభవంగా నిర్వహించారు. శివపార్వతి, గంగాదేవీల ఉత్సవ విగ్రహాలను వేద మంత్రోచ్చారణలు చేస్తూ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.  కార్యక్రమంలో ఛైర్మన్‌ కానాల విజయలక్ష్మి, ప్రధాన అర్చకులు చలపతి, కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

కొండాపురంలో విజయదశమి వేడుకలు 

కొండాపురం, అక్టోబరు 16: మండలంలోని దత్తాపు రం గ్రామం పెద్దమ్మగుడిలో విజయదశమి వేడు కలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 2వేలకు మందికిపైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా కొండాపురం అమ్మవారిశాలలో చుట్టూ బ్యాక్‌వాటర్‌ చేరి ఉండడంతో నామమా త్రంగా విజయదశమి వేడుకలను నిర్వహించారు.







Updated Date - 2021-10-17T05:02:06+05:30 IST