Dussehra festival: దసరా కోసం 2వేల అదనపు బస్సులు

ABN , First Publish Date - 2022-09-28T17:28:13+05:30 IST

దసరా పండుగ(Dussehra festival) నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) రాష్ట్రంలోని వివిధ

Dussehra festival: దసరా కోసం 2వేల అదనపు బస్సులు

బెంగళూరు, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దసరా పండుగ(Dussehra festival) నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్ధం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు 2 వేల అదనపు బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి అక్టోబరు 3 వరకు బెంగళూరు నుంచి వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సుల సంచారం ఉం టుందని కేఎస్‌ఆర్టీసీ నగరంలో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ధర్మస్థళ, కుక్కేసుబ్రహ్మణ్య, శృంగేరి, హొరనాడు, శివమొగ్గ, మడికేరి, మంగళూరు, దావణగెరె, గోకర్ణ, కొల్లూరు, హుబ్బళ్ళి, ధార్వాడ, బెళగావి, విజయపుర, కార్వార, బళ్ళారి, హొసపేట, కలబురగి, రాయచూరు, హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, ఊటి, కొడైకెనాల్‌, సేలం, తిరుచనాపల్లి,  పుదుక్కోట, మధురై, పణజి, శిరడి, ఎర్నాకులం, పాల్ఘాట్‌, పునాలకు ఈ ప్రత్యేక బస్సులు అందు బాటులో ఉంటాయని ప్రకటన పేర్కొంది. కాగా మైసూరు దసరా ఉత్సవాలలో ఈసారి పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉండటంతో ఆర్టీసీ మైసూరు జిల్లా కోసమే ప్రత్యేకంగా 450 బస్సులను అదనంగా నడుపనుంది. ఇందులో 200 బస్సులు ప్రతిరోజూ బెంగళూరు-మైసూరు నగరాల మధ్య సంచ రిస్తాయని ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉండగా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణీకులు ముందుగా తమ టికెట్లను రిజర్వుచేసుకుంటే చార్జీలో 5 శాతం ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నారు. కాగా ప్రతి ప్రయాణీకుడు రాను పోను టికెట్లను ఒకేసారి రిజర్వు చేసుకుంటే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-28T17:28:13+05:30 IST