Advertisement

దసరా వచ్చింది... తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సందడి తెచ్చింది.

Oct 27 2020 @ 01:34AM

దసరా వచ్చింది... తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సందడి తెచ్చింది. కొత్త సినిమా కబుర్లు, క్లాప్‌బోర్డు చప్పుళ్లతో కళకళలాడింది. కరోనా కారణంగా ఆరు, ఏడు నెలల నుంచి టాలీవుడ్‌లో ఓ స్తబ్ధత వాతావరణం నెలకొంది. ఓ విధంగా దానిని విజయదశమి నాడు దహనం చేశారని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సినిమాలను ప్రకటించారు. క్లాప్‌లు కొట్టారు. కొత్త టీజర్లు, ట్రైలర్లు, పాటలు విడుదల చేశారు.  పెద్దా చిన్నా కలుపుకుంటే సుమారు పదిహేను చిత్రాల వరకూ ప్రారంభమయ్యాయి. దాంతో తెలుగు చిత్రసీమలో సందడి మళ్లీ మొదలైంది. ఇకనుంచి వరుసగా చిత్రాలు ప్రారంభమవుతాయనీ, చిత్రీకరణలతో స్టూడియోలు, లోకేషన్‌లలో హంగామా మొదలవుతుందని ఆశించవచ్చు. మొత్తానికి... ఈ ఏడాది విజయదశమి సినిమా జనాలకు నూతన ఉత్సాహాన్ని అందించింది. దసరాకి ప్రారంభమైన, ప్రకటించిన కొత్త సినిమాల వివరాలు...

 

మరోసారి పోలీ్‌సగా పవన్‌


హీరో: పవన్‌ కల్యాణ్‌

దర్శకుడు: సాగర్‌ కె. చంద్ర

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

సమర్పణ: పి.డి.వి. ప్రసాద్‌

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌

కూర్పు: నవీన్‌ నూలి

కళ: ఏఎస్‌ ప్రకాశ్‌

ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల

సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌

‘‘పవన్‌ కల్యాణ్‌గారితో సితార సంస్థ నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తాం. ‘గబ్బర్‌ సింగ్‌’లో పోలీ్‌సగా నటించిన పవన్‌ కల్యాణ్‌, మరోసారి పవర్‌ఫుల్‌ పోలీ్‌సగా ఈ చిత్రంలో రక్తి కట్టించనున్నారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయంతో పాటు నటీనటులు, ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తాం.’’ 

సూర్యదేవర నాగవంశీ.


థ్యాంక్యూ


హీరో: నాగచైతన్య

దర్శకుడు: విక్రమ్‌ కె. కుమార్‌

నిర్మాతలు: ‘దిల్‌’ రాజు, శిరీష్‌, హర్షిత్‌రెడ్డి

నిర్మాణ సంస్థ: 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

కథ-మాటలు: 

బీవీఎస్‌ రవి

కూర్పు: నవీన్‌ నూలి

ఛాయాగ్రహణం: 

పీసీ శ్రీరామ్‌

సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌

‘‘ఇప్పటివరకూ నాగచైతన్యను చూడని స్టైల్‌లో, సరికొత్తగా ప్రజెంట్‌ చేసేలా ఉంటుందీ సినిమా. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం.’’ 

‘దిల్‌’ రాజు

శ్యామ్‌ సింగ రాయ్‌


హీరో: నాని

హీరోయిన్లు: సాయిపల్లవి, కృతి శెట్టి

దర్శకుడు: రాహుల్‌ సంకృత్యాన్‌

నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి

నిర్మాణ సంస్థ: 

నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌

కథ: సత్యదేవ్‌ జుంగా

కూర్పు: నవీన్‌ నూలి

ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్ఘీస్‌

సంగీతం: మిక్కీ జె. మేయర్‌


‘‘ఈ చిత్రంలో నాని కొత్తగా కనిపించనున్నారు. లుక్‌, డ్రస్సింగ్‌ వైవిధ్యంగా ఉంటాయి. 

భారీ బడ్జెట్‌, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న విభిన్న చిత్రమిది. ‘టక్‌ జగదీష్‌’ చిత్రీకరణ 

పూర్తయ్యాక, డిసెంబర్‌ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో నాని పాల్గొంటారు.’’ 

వెంకట్‌ బోయనపల్లి


కోతి కొమ్మచ్చి


హీరోలు: మేఘాంశ్‌ శ్రీహరి, సమీర్‌ వేగేశ్న 

హీరోయిన్లు: రిద్ధీ కుమార్‌, మేఘా చౌదరి

దర్శకుడు: వేగేశ్న సతీశ్‌

నిర్మాత: ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ

నిర్మాణ సంస్థ: 

లక్ష్య ప్రొడక్షన్స్‌

ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

‘‘నవంబర్‌ 3 నుంచి అమలాపురంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఆ తర్వాత విశాఖలో కొంత చిత్రీకరణ చేస్తాం. ఏకధాటిగా సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం.’’

వేగేశ్న సతీశ్‌


ఆడాళ్లూ... మీకు జోహార్లు!


హీరో: శర్వానంద్‌

హీరోయిన్‌: రష్మికా మందన్న

దర్శకుడు: కిశోర్‌ తిరుమల

నిర్మాత: సుధాకర్‌ చెరుకూరి

నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌

ఛాయాగ్రహణం: 

సుజిత్‌ సారంగ్‌

హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. చిత్రదర్శకుడు కిశోర్‌ తిరుమలకి అనగాని సత్యప్రసాద్‌, 14 రీల్స్‌ ప్లస్‌ అధినేతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట స్ర్కిప్ట్‌ అందజేశారు.

రొమాంటిక్‌  ఎంటర్‌టైనర్‌!


హీరో: శ్రీ సింహా

హీరోయిన్లు: శుక్ల, 

మిషా నారంగ్‌

దర్శకుడు: మణికాంత్‌ గెల్లి

నిర్మాతలు: సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని

నిర్మాణ సంస్థలు: వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్‌

కథ: నాగేంద్ర పిల్ల

కూర్పు: సత్య గిడుతూరి

ఛాయాగ్రహణం: సురేశ్‌ రగుతు

సంగీతం: కాలభైరవ

‘‘ఇదొక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. దర్శకుడిగా తొలి చిత్రమైనా చక్కటి కథ సిద్ధం చేశాడు. త్వరలో టైటిల్‌ ప్రకటిస్తాం.’’ 

సాయి కొర్రపాటి, 

రవీంద్ర బెనర్జీ ముప్పానేని.


ఆద్య (వెబ్‌ సిరీస్‌!)


ప్రధాన తారలు: రేణూ దేశాయ్‌, నందినీ రాయ్‌, వైభవ్‌ తత్వవాడి

దర్శకుడు: ఎం.ఆర్‌. కృష్ణ 

మామిడాల

నిర్మాతలు: డి.ఎస్‌. రావు, 

రజనీకాంత్‌ .ఎస్‌

నిర్మాణ సంస్థలు: డి.ఎ్‌స.కె. స్ర్కీన్‌, సాయికృష్ణ ప్రొడక్షన్స్‌

కథ-మాటలు: ఆదిత్య భార్గవ్‌

ఛాయాగ్రహణం: శివేంద్ర దాశరథి

‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేంత గొప్ప కథతో రూపొందుతున్న వెబ్‌ సిరీస్‌ ఇది. నన్ను విపరీతంగా ఆకట్టుకుంది.’’ 

రేణూ దేశాయ్‌Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.