దసరా సంబురం

ABN , First Publish Date - 2021-10-17T04:44:47+05:30 IST

సిద్దిపేట జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఆలయాలు కిటకిటలాడాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శమి వృక్షాలకు పూజలు నిర్వహించారు. జమ్మిని పంచుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఆయుధ పూజలు చేశారు. ఊరూరా రావణ దహన కార్యక్రమాలను నిర్వహించారు. శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు.

దసరా సంబురం
రంగఽధాంపల్లిలో రావణ దహనాన్ని తిలకిస్తున్న జనం, రంగధాంపల్లిలో రావణ దహనం దృశ్యం

మిన్నంటిన విజయదశమి వేడుకలు

ఊరూరా శమీ, ఆయుధ పూజలు


సిద్దిపేట జిల్లాలో దసరా సంబురాలు అంబరాన్నంటాయి. ఆలయాలు కిటకిటలాడాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శమి వృక్షాలకు పూజలు నిర్వహించారు.  జమ్మిని పంచుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఆయుధ పూజలు చేశారు. ఊరూరా రావణ దహన కార్యక్రమాలను నిర్వహించారు. శరన్నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. 



సిద్దిపేట రూరల్‌, అక్టోబరు 16 : విజయదశమి సంబురాలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఉదయం ఆలయాల్లో దైవ దర్శనం చేసుకున్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఆయుధ పూజను చేశారు. జమ్మిచెట్టుకు పూజ నిర్వహించి జమ్మి ఆకులను పంచుకుంటూ ఒకరికొకరు ఆలింగనం చేసుకొని దసరా శుభాకాంక్షలను తెలుపుకున్నారు. పట్టణంలోని రంగధాంపల్లిలో రావణ దహనం కార్యక్రమాన్ని అశేష జనవాహిని మధ్య ఘనంగా నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజులరాజనర్సు దంపతులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మంత్రి నివాసానికి వెళ్లి జమ్మి ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల్లోనూ రావణ దహన కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పాలపిట్టలను ఎగురవేశారు. ప్రజలు తిలకించి హర్షం వ్యక్తంచేశారు. రంగధాంపల్లి చౌరస్తా హనుమాన్‌ ఆలయం వద్ద సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి పాలపిట్టను వదిలిపెట్టారు. సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి ఆయన స్వగ్రామమైన ఇర్కోడ్‌లో దసరా సంబురాల్లో పాల్గొన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ రోజా రాధాకృష్ణశర్మ దంపతులు వారి స్వగ్రామమైన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ ఆధ్వర్యంలో స్థానిక నర్సాపూర్‌ చౌరస్తా సమీపంలో ప్రజలకు తాగునీటిని పంపిణీ చేశారు ప్రతి సంవత్సరమూ ప్రజలకు దసరా రోజు తాగునీరు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ తెలిపారు. అమర్నాథ్‌ ట్రస్ట ఆధ్వర్యంలో భక్తులకు పులిహోరను పంపిణీ చేశారు.


ఇంటి ముందుకే పాలపిట్ట

దసరా సంబరాల్లో భాగంగా జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి పాలపిట్టను చూసి జమ్మి ఆకు(బంగారం) పంచుకుంటూ దసరా సంబురాలను నిర్వహించకోవడం ఆనవాయితీ. అయితే పాలపిట్టను చూడడానికి గ్రామ శివారులోని జమ్మిచెట్టు వద్దకు వెళ్లి అటువైపుగా ఉన్న చెట్ల వైపు చూస్తూ పాలపిట్ట కోసం వెతికేవారు. ప్రస్తుత కాలంలో పాలపిట్టలు అరుదుగా కనిపిస్తుండడంతో అందరికీ దసరా రోజున పాలపిట్ట దర్శనం లభించడం లేదు. శుక్రవారం జరిగిన దసరా సంబరాల్లో కొంతమంది పాలపిట్టలను బుట్టల్లో పట్టుకొచ్చి సిద్దిపేట పట్టణంలో సంచరించారు. ఇంటింటికీ తిరుగుతూ పాలపిట్టను చూపిస్తానంటూ ప్రచారం చేశారు. ఒక్కొక్కరికి ఐదు రూపాయలు తీసుకున్నారు. ఇంటి ముందుకే పాలపిట్ట రావడం, దసరా రోజు పాలపిట్టని చూడడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.


సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక : ఎంపీ

దుబ్బాక, అక్టోబరు 16 : సంస్కృతీ, సంప్రదాయాలకు దసరా పండుగ ప్రతీకగా నిలుస్తుందని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభార్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మండలంలోని పోతారం గ్రామంలో వేడుకలు నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి  అడవికి వెళ్లి జమ్మి ఆకులను కోసుకొచ్చారు. గ్రామంలోని అందరికీ పంచుతూ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామమైన బొప్పాపూర్‌ గ్రామంలో దసరా పండుగను జరుపుకున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు ఎంపీ, ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకంక్షాలను తెలియజేశారు. అలాగే దుబ్బాకలోని శ్రీబాలాజీ వెంకటేశ్వరాలయంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు వేర్వేరుగా కుటుంబ సమేతంగా శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వాగతం పలుకగా, పురోహితులు శాలువాతో సన్మానించారు. 


చెడుపై విజయానికి సంకేతం : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట సిటీ, అక్టోబరు 16 : చెడు మీద విజయానికి సంకేతంగా విజయదశమిని నిర్వహించుకోవాలని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేట పట్టణంలో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలు సిరి సంపదలతో జీవించేలా దీవించాలని దుర్గామాతను ప్రార్థించినట్లు చెప్పారు. కాగా విజయదశమి సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రి హరీశ్‌రావు జమ్మి ఇచ్చిపుచ్చుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలను తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే స్ఫూర్తితో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పనిచేస్తారని తెలిపారు. కాగా సిద్దిపేట శివారు ఇందూర్‌ కళాశాల సర్కిల్‌లో నూతన పెట్రోల్‌బంకును మంత్రి ప్రారంభించారు. ఈ మేరకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి వాహనంలో రూ.500 పెట్రోల్‌ పోయించి మొదటగా బోణీ చేశారు. అనంతరం టీ టైమ్‌ పాయింట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. వీరి వెంట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్‌ పాల సాయిరాం, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-17T04:44:47+05:30 IST