శ్రీగిరిపై దసరా సందడి

ABN , First Publish Date - 2021-10-17T05:11:04+05:30 IST

శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందర్భంగా తొమ్మిదో రోజు శుక్రవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు.

శ్రీగిరిపై దసరా సందడి

  1. భ్రమరాంబకు వివిధ అలంకరణలు
  2. స్వామి, అమ్మవార్లకు వాహన సేవలు


శ్రీఽశైలం, అక్టోబరు 16: శ్రీశైలంలో దసరా మహోత్సవాల సందర్భంగా తొమ్మిదో రోజు శుక్రవారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. పుష్కరిణి వద్ధ  తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజు అమ్మవారి యాగశాలలో చండీయాగ పూర్ణాహుతి, స్వామివారి యాగశాలలో రుద్రయాగ పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం చండీశ్వరస్వామికి మల్లికార్జున గుండం వద్ద అవబృధస్నానం నిర్వహించారు. 

- విజయ దశమి రోజున శుక్రవారం ఉదయం అమ్మవారికి సిద్ధిదాయని అలంకారం చేశారు. అశ్వవాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. అశేష భక్తజనం వేడుకలను కన్నులారా వీక్షించారు. 

- శుక్రవారం సాయంత్రం అమ్మవారు భ్రమరాంబ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగించారు. 

- దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శమీ వృక్షనికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. నందివాహనంపై ఆశీనులైన స్వామి అమ్మవార్లను శమీ వృక్షం వద్దకు తొడ్కొని వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి  వద్దకు తోడ్కొని వచ్చి తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్‌ లవన్న, ఆలయ అధికారులు, ప్రధాన అ



Updated Date - 2021-10-17T05:11:04+05:30 IST