అంబరాన్నంటిన దసరా సంబురాలు

ABN , First Publish Date - 2021-10-17T04:57:10+05:30 IST

దసరా సంబురాలు అంబరాన్నంటాయి. విజయ దశమి వేడుకలను జరుపుకునేందుకు పట్నాల నుంచి పల్లెలకు జనం భారీ ఎత్తున తరలి రావడంతో గ్రామీణ ప్రాంతాలు ప్రత్యేక కళను సంతరించుకున్నాయి.

అంబరాన్నంటిన దసరా సంబురాలు
మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద బతుకమ్మ ఆడుతున్న మహిళలు, పాల్గొన్న ప్రజలు

- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కందనూలు కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్‌


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దసరా సంబురాలు అంబరాన్నంటాయి. విజయ దశమి వేడుకలను జరుపుకునేందుకు పట్నాల నుంచి పల్లెలకు జనం భారీ ఎత్తున తరలి రావడంతో గ్రామీణ ప్రాంతాలు ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. శుక్రవారం జరిగిన దసరా వేడుకలకు నాగర్‌కర్నూల్‌ కేసరి సముద్రం మినీ ట్యాంక్‌బండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మినీ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే వారి కోసం ఇటీవల విస్తరించడంతో పాటు ఆధునీకరణ పనులు చేపట్టడం, విద్యుత్‌ అలంకరణతో కేసరి సముద్రం ప్రత్యేకతను సంతరించుకుంది. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పన శమీ పూజ నిర్వహించారు. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, కాంగ్రెస్‌ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్‌రావులు హాజరై ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన సతీమణి గువ్వల అమల శమీ పూజలో పాల్గొన్నారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎడ్మ సత్యం, మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌, బీజేపీ జిల్లా నాయకుడు రాఘవేందర్‌గౌడ్‌ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. 


- మినీ ట్యాంక్‌బండ్‌పై జమ్మిచెట్టుకు  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పూజలు


నాగర్‌కర్నూల్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలో దసరా పర్వదినాన్ని శుక్రవారం పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కేసరిసముద్రం మినీ ట్యాంక్‌బండ్‌పై జమ్మిచెట్టుకు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కల్పనతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ట్యాంక్‌ బండ్‌పై ఉన్న దసరా సంబురాల వేదిక వద్దకు చేరుకుని పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరో నా మహమ్మారి ప్రమాదం బారి నుంచి తప్పించుకున్న ప్రజలు సంపూర్ణ ఆ యురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని దుర్గామాతని ప్రార్థించారు. గడిచిన నాలుగేళ్లలో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్న మినీ ట్యాంక్‌బండ్‌ రాబోయే రోజుల్లో హైదరాబాదు ట్యాంక్‌బండ్‌ తరహాలో ప్రతీ ఆదివారం పూర్తి స్థాయిలో పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా తీర్చి దిద్దుతానన్నారు. అనంతరం పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. వేదిక వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలు ఆడి చెరువులో నిమజ్జనం చేశారు. మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద ముస్లిం మైనార్టీస్‌ ఆధ్వర్యంలో పూలు పంచిపెట్టి దసరా శుభాకాంక్షలు తెలి పారు. అనంతరం పట్టణ ఆరెకటికెల సంఘం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌కు ని మజ్జనానికి తీసుకువచ్చిన దుర్గామాత అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఆరె కటికెలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో పాటు బీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. మునిసిపల్‌  వైస్‌ చైర్మ న్‌ బాబురావు, బీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతి నిధులు, నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.  




Updated Date - 2021-10-17T04:57:10+05:30 IST