‘సంపద’కు తూట్లు.. చెత్తతో పాట్లు..!

ABN , First Publish Date - 2021-03-01T06:15:16+05:30 IST

పట్టణంలో పారిశుధ్య సమస్య పరి ష్కారం.. తద్వారా పంచాయతీకి ఆదా యం సమకూరాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన సంపద కేంద్రం నిరుప యోగంగా మారింది.

‘సంపద’కు తూట్లు.. చెత్తతో పాట్లు..!
పట్టణంలో వృథాగా ఉన్న సంపద తయారీ కేంద్రం

  ‘పేట’లో పారిశుధ్య సమస్య 

 సేకరించిన చెత్తాచెదారం ఖాళీ స్థలాల్లో పారబోత 

 గుట్టలుగా పేరుకుపోయి దుర్వాసన 

 నిరుపయోగంగా సంపద కేంద్రం

పాయకరావుపేట, ఫిబ్రవరి 28 : పట్టణంలో పారిశుధ్య సమస్య పరి ష్కారం.. తద్వారా పంచాయతీకి ఆదా యం సమకూరాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన సంపద కేంద్రం నిరుప యోగంగా మారింది. లక్షలాది రూపా యలు వెచ్చించి చేపట్టిన ఈ నిర్మాణాలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలు స్తున్నాయి. దీంతో పంచాయతీ సిబ్బంది పట్టణంలో రోజూ సేకరిస్తున్న చెత్త ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పేరుకు పోతోంది. పాయకరావుపేట మేజర్‌ పంచాయతీలో పరిశుభ్ర వాతావరణం నెలకొల్పడంతో పాటు ప్రతిరోజూ సేకరించిన  చెత్త ద్వారా పంచాయతీకి ఆదాయం సమకూ రేలా మంగవరం రోడ్డు శివారు శ్మశాన వాటిక వద్ద సుమారు రూ.30 లక్షలతో చెత్త నుంచి సంపద  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  పట్టణంలోని 20 వార్డుల్లో చెత్త సేకరణకు రెండు ట్రాక్టర్లు, మూడు మినీ వాహనాలు, 27 మూడు చక్రాల రిక్షాలు అందుబాటులో ఉండగా, ప్రజారోగ్యశాఖ విభాగంలో సుమారు 60 మంది పని చేస్తున్నారు. వీరంతా రోజూ పట్టణంలో సేకరించిన తడి, పొడి చెత్తను సంపద తయారీ కేంద్రానికి తరలించాలి. అక్కడ చెత్తను గ్రేడింగ్‌ చేసి వర్మీ కంపోస్టు తయారు చేయడంతో పాటు పొడి చెత్త, ప్లాస్టిక్‌, గాజుముక్కలను పిండిచేసి విక్ర యించాలి. దీని ద్వారా పారిశుధ్యం మెరుగు పడడంతో పాటు పంచాయతీకి ఆదాయం సమకూరాలన్నది ఈ పథకం లక్ష్యం. అయితే సంపద కేంద్రం నిర్వహ ణను ఏడాదిన్నగా నిలిపివేశారు. సిబ్బంది రోజూ సేకరిస్తున్న చెత్తను ఈ కేంద్రాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో గుట్టగా పోస్తున్నారు. మరికొంత పట్ట ణంలోని ఖాళీ స్థలాల్లో పెంట కుప్పల్లా పోగవుతోంది. 

సగానికిపైగా  ముఠా ఆన కట్ట వద్ద తాండవ నది గట్టుపై పారబో స్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు డం పింగ్‌ యార్డులుగా కనిపిస్తున్నాయి. దీనికితోడు ఈ చెత్త కుప్పలను పం దులు చిందరవందర చేస్తుండడం అపారి శుధ్యానికి మరింత కారణమ వుతుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లా డుతూ పంచాయతీలోని ప్రజా రోగ్య విభాగంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నా పారిశుధ్యం మాత్రం మెరుగు పడడం లేదని వాపోతున్నారు. ఇటీవల ఎన్నికైన పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులైనా సంపద కేంద్రాన్ని విని యోగంలోకి తెచ్చి, తద్వారా పట్టణంలో చెత్త సమస్య లేకుండా చూడాలని అంతా కోరుతున్నారు.

Updated Date - 2021-03-01T06:15:16+05:30 IST