కుప్పకూలుతున్న దువ్వపాలెం క్వారీ కొండ

ABN , First Publish Date - 2022-06-29T06:04:43+05:30 IST

మండలంలోని ఏఎస్సార్‌పురం పరిధిలోని దువ్వపాలెం క్వారీ కొండ మరోసారి స్వల్పంగా మంగళవారం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

కుప్పకూలుతున్న దువ్వపాలెం క్వారీ కొండ
జారి పడుతున్న కొండచరియలు

భయాందోళన చెందుతున్న స్థానికులు

పెందుర్తి, జూన్‌ 28: మండలంలోని ఏఎస్సార్‌పురం పరిధిలోని దువ్వపాలెం క్వారీ కొండ మరోసారి స్వల్పంగా మంగళవారం కుప్పకూలడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు క్వారీ కొండ పై భాగం  నుంచి దట్టమైన ధూళితో కొండచరియులు కుప్పకూలుతున్నాయి. అడ్డగోలు క్వారీ తవ్వకాలతో కొండను ఛిద్రం చేయడం వల్లే ఇది కుప్పకూలుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ నెల రెండున ఇక్కడే క్వారీ పనులు చేస్తున్న క్రమంలో కొండ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అధికారులు ఎటువంటి పరిరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే కొండ కూలుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్వారీ లీజును రద్దు చేయాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-06-29T06:04:43+05:30 IST