విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం

ABN , First Publish Date - 2021-02-27T03:35:24+05:30 IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది విఽధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డ్వామా పీడీ తిరుపతయ్య హెచ్చరించారు.

విధి నిర్వహణలో అలసత్వాన్ని సహించం
సమావేశంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ తిరుపతయ్య

డ్వామా పీడీ తిరుపతయ్య

వింజమూరు(ఉదయగిరి రూరల్‌), ఫిబ్రవరి 26: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది విఽధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని డ్వామా పీడీ తిరుపతయ్య హెచ్చరించారు. శుక్రవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో నియోజకవర్గస్థాయిలో ఉపాధి సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల సంఖ్య పెంచడంతోపాటు ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కూలీల పిల్లలకు ఉన్నతి పథకం కింద 90 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ పథకంపై కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మాసం మండలస్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నూరు శాతం పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలను అధిగమించని సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ విజయకుమార్‌, ఎంపీడీవో కనకదుర్గాభవానీ, ఏపీవోలు ఎంవీ సుభాషిణి, నాగరాజు, భానునాయక్‌, శ్రీనివాసులు, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల టెక్నికల్‌ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-27T03:35:24+05:30 IST