స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరిస్తున్న అర్చకులు
ద్వారకాతిరుమల, మే 22: చినవెంకన్నకు ఆదివారం రాత్రి కన్నుల పండువగా వడైతి ఉత్సవాన్ని అర్చకులు జరిపించారు. ఆలయంలో రాత్రి వెండితొళక్క వాహ నంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పా లంకరణ చేశారు. మేళతాళాలు మంగళవాయిద్యాలు అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అట్టహాసంగా ఆలయంలోని నైరుతి మండపం వద్దకు తీసుకెళ్లారు. అందులో ఉత్సవమూర్తులను ఉంచి పూజలు చేసి హారతులను సమర్పించారు. ప్రసాదాన్ని నివేదన జరిపి భక్తులకు పంపిణీ చేశారు.