AP: రేపటి నుంచి ద్వారకా తిరుమలలో సుప్రభాత సేవ రద్దు

ABN , First Publish Date - 2021-12-15T13:32:22+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు కానుంది.

AP: రేపటి నుంచి ద్వారకా తిరుమలలో సుప్రభాత సేవ రద్దు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల చిన వెంకన్న స్వామి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు కానుంది. రేపటి  నుండి వచ్చేనెల 14 వరకు ధనుర్మాసం సందర్భంగా ఈ సేవను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాని స్థానంలో తిరుప్పావై పాశురములు జరుగనున్నాయి. వచ్చేనెల 15 నుండి  సుప్రభాత సేవ పునఃప్రారంభంకానున్నట్లు ఈవో పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-15T13:32:22+05:30 IST