
ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బౌలర్ డ్వేన్ బ్రావో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లసిత్ మలింగ సరసన చేరాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన బ్రావో మొత్తం 170 వికెట్లు సాధించి మలింగ అత్యధిక వికెట్ల రికార్డును సమం చేశాడు.
బ్రావో తన 151వ గేమ్‌లో ఈ ఘనత సాధించగా, మలింగ కేవలం 122 మ్యాచుల్లో 19.79 సగటుతో ఆ ఘనత సాధించాడు. ఓ మ్యాచ్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అదే అతడి బెస్ట్. మలింగ తన ఐపీఎల్ కెరియర్లో ఆరుసార్లు నాలుగు వికెట్లు, ఒకసారి ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
బ్రావో రెండుసార్లు నాలుగేసి వికెట్లు పడగొట్టాడు. వీరి తర్వాతి స్థానంలో అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. అమిత్ మిశ్రా 166, చావ్లా 157 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 160 మ్యాచుల్లో 150 వికెట్లతో టాప్-5లో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి