జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌?

ABN , First Publish Date - 2021-11-15T05:46:21+05:30 IST

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌?

జనసేనలోకి మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌?

పామర్రు, నవంబరు 14 : పామర్రు నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే డీవై దాస్‌ జనసేన తీర్థం తీసుకోనున్నట్లు ఆయన ముఖ్య అనుయాయుల ద్వారా తెలిసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా రాజకీయలకు దూరంగా ఉంటూనే, 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీ టికెట్‌ ఆశించారు. కుదరకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. అనంతరం వైసీపీ నుంచి పిలుపు రావడంతో ఆ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో దాస్‌ జనసేనలో చేరుతున్నారనే సంకేతాలు రావడంతో ఆయన అభిమానుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దాస్‌ వర్గీయులు మాట్లాడుతూ జనసేనలో చేరేందుకు చర్చలు జరుగుతున్న విషయం నిజమేనని చెప్పారు. కొద్దిరోజుల్లో జనసేనలో చేరడంపై స్పష్టత ఇవ్వనున్నామన్నారు.

Updated Date - 2021-11-15T05:46:21+05:30 IST