1 నుంచి వస్త్రాల ఈ వేలం

ABN , First Publish Date - 2020-11-27T06:13:41+05:30 IST

వినియోగంలో లేని వస్త్రాలను టీటీడీ వేలం వేయనుంది

1 నుంచి వస్త్రాల ఈ వేలం

1 నుంచి వస్త్రాల ఈ వేలం


తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): టీటీడీ వినియోగంలో లేని 287 లాట్ల వస్త్రాలను డిసెంబర్‌ కటి నుంచి ఐదో తేది వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోళ్ల పోర్టల్‌ ద్వారా ఈ వేలం వేయనున్నారు. ఇందులో పట్టు వస్త్రాలు, ఆర్ట్‌ పట్టు, పాలిస్టర్‌, సాధారణ పంచెలు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, పంజాబీ డ్రస్సు మెటిరీయల్‌, హుండీ గల్లేబులు తదితరాలు ఉంటాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర వివరాలకు టీటీడీ మార్కెటింగ్‌ విభాగాన్ని 0877 2264429ను సంప్రదించవచ్చని సూచించింది.


4న సేంద్రియ ఎరువుల ఈ వేలం 

తిరుమలలోని కాకులకొండలో టీటీడీ ఏర్పాటు చేసిన సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌లో తయారు చేసిన ఆరు వేల టన్నుల ఎరువును 4వ తేదీన ఈ వేలం వేయనున్నారు. వివరాలకు తిరుమలలోని ఇఇ- 8 కార్యాలయాన్ని 0877-2263525, 0877-2263241 నెంబర్లలో సంప్రదించాలి. లేదా ఠీఠీఠీ.జుౌుఽఠజౌజూఠ.్చఞ.జౌఠి.జీుఽ   పోర్టల్‌లో చూడవచ్చు. 

Updated Date - 2020-11-27T06:13:41+05:30 IST