ఈ-క్రాప్‌తో ఉపయోగాలు

ABN , First Publish Date - 2021-04-18T05:52:47+05:30 IST

ఈ-క్రాప్‌ పంట నమోదు వలన చాలా ఉపయోగాలు ఉంటాయని దర్శి వ్యవసాయ సహాయ సం చాలకులు అర్జున్‌ నాయక్‌ తెలిపారు.

ఈ-క్రాప్‌తో ఉపయోగాలు


 రైతులు పంటల 

 నమోదు చేయించాలి

 దర్శి వ్యవసాయ సహాయ

      సంచాలకుడు అర్జున్‌నాయక్‌

పొదిలి రూరల్‌, ఏప్రిల్‌ 17:  ఈ-క్రాప్‌ పంట నమోదు వలన చాలా ఉపయోగాలు ఉంటాయని దర్శి వ్యవసాయ సహాయ సం చాలకులు అర్జున్‌ నాయక్‌ తెలిపారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పంట సాగు చేసిన ప్రతి ఒక్క రైతు ఈ క్రాప్‌ నమోదు చేసుకోవడం వలన క్రాప్‌ ఇన్సూరెన్సు, ప్రభుత్వం నుంచి వచ్చే పంట నష్టపరిహారం, పండించిన పంట అ మ్ముకోవడానికి వీలుంటుందని తెలిపారు. రైతు ఉత్పత్తి సంఘాల వ లన చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. రైతు భరో సా కేంద్రాల్లో రైతులందరు రైతు ఉత్పత్తి సంఘాల్లో చేరే విధంగా చొరవతీసుకోవాలని సంబంధిత అధికారులకు చె ప్పారు. రైతులు తమ పొ లాల్లో మట్టి నమూనాలను తీసి తప్పని సరిగా భూసార పరీక్షలు చేయించుకొని వచ్చి న ఫలితాల ప్రకారం ఎరువులు వాడినట్లైతే పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటా యన్నారు. పచ్చిరొట్టె, కందులు, ఎరువులు పొదిలి రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంటాయని వ్యవసాయధికారి డి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.  ఉద్యాన పంటలు  సా గుచేసే రైతులకు డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతి ద్వారా నీరు, ఎరువులు సరఫరా చేస్తారని  ఉద్యాన శాఖ అధికారి సంధ్య తెలిపారు. నీటి కుంటలు తీసుకునేందుకు, అన్ని రకాల పండ్ల తోటలు వేసుకనేందుకు 40 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వి హనుమంతరావు,  ఎంపీడీవో శ్రీకృష్ణ, ఏపీవో బు ల్లెన్నరావు తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-04-18T05:52:47+05:30 IST