ఈ-పంట నమోదుకు బాలారిష్టాలు

ABN , First Publish Date - 2022-08-19T07:19:15+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌లో పంటల ఈ క్రాపింగ్‌కు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల వివరాల నమోదుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను తెరపైకి తీసుకువచ్చింది. కొత్త యాప్‌లో రోజుకో విధంగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ట్ర యల్‌ రన్‌ తర్వాత 10రోజులకు క్షేత్రస్థాయిలో ఈ-పంట నమోదులను ప్రా రంభించారు.

ఈ-పంట నమోదుకు బాలారిష్టాలు

  • కొత్త యాప్‌లో పలు సాంకేతిక లోపాలు
  • రైతుల సర్వే నెంబర్ల డౌన్‌లోడ్‌ కానివైనం
  • సంయుక్త అజమాయిషీలో సమన్వయ లోపం 

సామర్లకోట, ఆగస్టు 18: ఖరీఫ్‌ సీజన్‌లో పంటల ఈ క్రాపింగ్‌కు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటల వివరాల నమోదుకు ప్రభుత్వం కొత్త యాప్‌ను తెరపైకి తీసుకువచ్చింది. కొత్త యాప్‌లో రోజుకో విధంగా సాంకేతిక లోపాలు బయటపడుతున్నాయి. ట్ర యల్‌ రన్‌ తర్వాత 10రోజులకు క్షేత్రస్థాయిలో ఈ-పంట నమోదులను ప్రా రంభించారు. కొత్త యాప్‌లో పలు కారణాలు, సాంకేతిక సమస్యలు ఉత్ప న్నం కావడంతో ఆశించినస్థాయిలో పంటల నమోదు ముందుకు సాగడం లేదు. ప్రతి పంటకూ వ్యవసాయ, రెవెన్యూ, సర్వేశాఖల ఆధ్వర్యంలో ఈ-పంట నమోదుకు నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. 

ఈ-పంట నమోదులో సాంకేతిక సమస్యలతో తీవ్రజాప్యం ఏర్పడడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈకేవైసీ విధానాన్ని చేసేలా, రైతుల ఆధార్‌ నెంబరు ను మాత్రమే నమోదు చేసేలా మార్పులు చేశారు. జియో ఫెన్సింగ్‌ని ఆప్షనల్‌ చేశారు. ఈకేవైసీ, జియో కాప్చరింగ్‌ ప్రక్రియ పంటల కొనుగోలు కార్యక్రమాల ప్రారంభ సమయానికి ప్రణాళిక ప్రకారం డేటాని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లోని పొలాల్లో ఈ-పం ట నమోదుకు వెళ్లే సిబ్బందితోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. సర్వే నెంబర్లు డౌన్‌లోడ్‌ కాకపోవడం, రైతుల వివరాలు యాప్‌ లో నమోదు చేసిన తర్వాత పొలంలో రైతు ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తే తిరస్కరణకు గురవుతోంది. 

రైతులకు తప్పని ఇబ్బందులు

కొత్తయాప్‌లో సాంకేతిక సమస్యలతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ-పంట నమోదులు చేయించుకునేందుకు పొలం వద్దకు వెళ్లినా ఫొటో అప్‌లోడ్‌ కాకపోవడంతో కొందరు, తమ సర్వే నెంబర్లు యాప్‌లో డౌన్‌లోడ్‌ కాకపోవడంతో మరికొందరు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది పలు ప్రాంతాల్లో ఈ-పంట నమోదులు వీఏఏలు సక్రమంగా చేపట్టకపోవడంతో వేలాదిమంది రైతులు ప్రభుత్వ లబ్ధికి దూరం కావా ల్సి వచ్చింఇది. ఈ పరిస్థితుల్లో రైతుల ఫిర్యాదుల మేరకు పెదబ్రహ్మదేవం, పి.వేమవరం తదితర గ్రామాల్లో అధికారులు విచారణలు, సొమ్ములు రిక వరీలు వంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీన్నిబట్టి ఈ-పంట నమోదు లో ఏస్థాయిలో లోపాలు జరిగాయో స్పష్టమవుతోంది. సెప్టెంబరు 7నాటికి ఈ-పంట నమోదుతోపాటు, ఈకేవైసీ నమోదులు పూర్తిచేయాలని ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఈ-పంట నమోదు సవ్యంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.

ఈ-పంట నమోదులు ఇలా..

ప్రతి సాగుదారుడూ సమీప గ్రామ వ్యవసాయ సహయకులతో పంట నమోదు చేసుకోవాలి. సాగుదారులు రైతు భరోసా కేంద్రాలకు వచ్చి తాను సాగు చేసే పంటలను నమోదు చేసుకోవాలి. సాగుదారుడు మాత్రమే స్వయంగా రావాలి. భౌతికంగా, డిజిటల్‌ రశీదు ఉండాలి. దీనిపై రైతు సంతకం, గ్రామ వ్యవసాయ సహయకుడి సంతకం ఉండాలి. పంట వేసిన ప్రతిచోటా ఈ-పంట బుకింగ్‌ చేయాలి. ఖరీఫ్‌ సాగు ప్రారంభమై నెలరోజులు దాటింది. వ్యవసాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ-పంట నమోదులు వేగవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, సర్వేయర్లు సంయుక్త అజమాయిషీలో నిర్వహించాల్సిఉంది. వారంతా రెవెన్యూ విభాగంలో జోరుగా రీసర్వే పనులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సాధ్యం కానిదిగా ఉంది.

Updated Date - 2022-08-19T07:19:15+05:30 IST