ఆరోగ్య సేతులో ఈ-పాస్‌ ఫీచర్‌

ABN , First Publish Date - 2020-04-16T17:09:41+05:30 IST

కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధమే లక్ష్యంగా తెచ్చిన ఆరోగ్య సేతు యాప్‌లో మరో రెండు ఫీచర్లను కేంద్రం చేర్చింది. ఇందులో ముఖ్యమైనది ఎలకా్ట్రనిక్‌ పాస్‌(ఈ-పాస్‌). బహిరంగ

ఆరోగ్య సేతులో ఈ-పాస్‌ ఫీచర్‌

యాప్‌లో 3 రంగులు- గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌..

ఆరోగ్యాన్ని బట్టి విభజన

కొవిడ్‌ అప్‌డేట్లతో కొత్త వెర్షన్‌ విడుదల


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధమే లక్ష్యంగా తెచ్చిన ఆరోగ్య సేతు యాప్‌లో మరో రెండు ఫీచర్లను కేంద్రం చేర్చింది. ఇందులో ముఖ్యమైనది ఎలకా్ట్రనిక్‌ పాస్‌(ఈ-పాస్‌). బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. కొవిడ్‌ లక్షణాలు, ఉత్పత్తి స్థానం, మాత్రికలను బట్టి దీనికి రూపకల్పన జరిగింది. ఇందులో 3 రంగులు(ఆకుపచ్చ, ఆరెంజ్‌, ఎరుపు) ఉంటాయి. ఆకుపచ్చ రంగు వస్తే సదరు వ్యక్తి బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరుగాడవచ్చు. ఆరెంజ్‌ రంగు ఉంటే వారు ఎవరితోనూ కలవొద్దు. పరిమితంగా ఆఫీసు, గృహ సంబంధ కార్యకలాపాల్లో పాల్గొనొ చ్చు, అయితే వారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి. ఇక రెడ్‌ ఉంటే వారు ఎక్కడికీ వెళ్లొద్దు. పూర్తినిర్బంధం పాటించాలి. చైనాలో ఈ పద్ధతిని విజయవంతంగా అనుసరించారు. దాన్ని ఆధారంగా చేసుకునే ఇక్కడ రూపొందించారు. కొవిడ్‌ లక్షణాలున్నవారిని గుర్తించి, వారి ద్వారా వారి స్నేహితులు, బంఽధువులు, పరిచయస్తులు, వారు తిరిగిన ప్రదేశాలను పరిశీలిస్తారు. వారిలో కొవిడ్‌ లక్షణాలున్నవారిని క్వారంటైన్‌ చేస్తారని ప్రఽధాన శాస్త్ర సలహాదారు విజయ్‌ రాఘవన్‌ చెప్పారు. బుధవారం విడుదల చేసిన వెర్షన్‌లో మరోఫీచర్‌.. కొవిడ్‌ అప్‌డేట్స్‌. ప్రపంచంలో, దేశంలో ఎన్ని కేసులున్నాయి, ఏ ఆసుపత్రుల్లో ఏఏ సౌకర్యాలున్నాయి, పరిస్థితేంటి, ఒకవేళ వస్తే ఎలా ఎవరిని సంప్రదించాలి... మొదలైనవి ఉన్నాయి. ఈ ఫీచర్లను ఇంకా ఆపరేషనలైజ్‌ చేయాల్సి ఉంది. కొద్ది రోజుల్లో అందుబాటులోకి తెస్తామని విజయ్‌ రాఘవన్‌ తెలిపారు.




సేతు: ప్రపంచంలోనే అతి వేగంగా పాపులర్‌ 


దేశంలో ఆరోగ్య సేతు యాప్‌ను 5 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా దీన్ని మొబైల్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని మోదీ జాతినుద్దేశించి మూడోసారి చేసిన ప్రసంగంలో కోరడంతో డౌన్‌లోడ్స్‌ అమాంతం పెరిగాయి. 39 మిలియన్ల యూజర్ల నుంచి నిమిషానికి లక్షమంది చొప్పున మంగళవారం నాడంతా దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈ నెల 2న ప్రారంభించిన ఈ యాప్‌ను 13 రోజు ల్లోనే 5 కోట్ల మంది ‘దిగుమతి’ చేసుకోవడం ప్రపంచ రికార్డు. రియాల్టీ గేమ్‌ షో యాప్‌ ‘పొకెమాన్‌ గో’ను 19 రోజుల్లో 5 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నది ఇప్పటిదాకా ఉన్న రికార్డు. 




సిబ్బందికి ప్రసార భారతి ఆదేశాలు 


కరోనా సమాచారాన్ని తెలిపే ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని, వినియోగించడాన్ని తప్పనిసరి చేస్తూ తమ సిబ్బందికి ప్రసార భారతి ఆదేశాలు జారీ చేసింది. ప్రసార భారతి కార్యాలయాల్లోకి వస్తున్న లేదా బయటకు వెళ్తున్న వారు స్మార్ట్‌ఫోన్లలో ఆ యాప్‌ను వినియోగిస్తున్నారా? లేదా? అన్న విషయాన్ని సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించి మరీ పంపాలని చెప్పింది. అలాగే, ఈ యాప్‌ గురించి ప్రజల్లో ప్రసార భారతి సిబ్బంది అవగాహన కల్పించాలని పేర్కొంది. 

Updated Date - 2020-04-16T17:09:41+05:30 IST