పిల్లల్లో హైపర్‌ యాక్టివ్‌కి కారణమిదేనా?

ABN , First Publish Date - 2022-08-22T16:31:17+05:30 IST

పిల్లలంటేనే అల్లరి. అల్లరి చేస్తేనే అందం, ఆనందం. అయితే కొందరు పిల్లలు మరీ హైపర్‌

పిల్లల్లో హైపర్‌ యాక్టివ్‌కి కారణమిదేనా?

పిల్లలంటేనే అల్లరి. అల్లరి చేస్తేనే అందం, ఆనందం. అయితే కొందరు పిల్లలు మరీ హైపర్‌ యాక్టివ్‌గా ఉంటారు. చెప్పిన మాట వినకుండా.. తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఇంతకీ ఈ హైపర్‌ యాక్టివ్‌కి కారణాలేంటీ..


  • చక్కెర తినటం వల్ల పిల్లలు హైపర్‌ యాక్టివ్‌గా ఉన్నారని 1970ల్లో విదేశాల్లోని కొందరు పేరెంట్స్‌ అనేవారు. అసలు ఇది నిజమా? కాదా? అనే విషయం తెలుసుకునేందుకు 1973లో అలెర్జిస్ట్‌ బెంజమిన్‌ ఫీన్‌గోల్డ్‌ అనే శాస్త్రవేత్త ఓ ప్రయోగం చేశారు. దీన్ని ‘ఫీన్‌గోల్డ్‌ థియరీ’ అని అంటారు. పేరెంట్స్‌ కథనాలు నిజమే అని తేలింది.
  • చక్కెరతో పాటు ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ హైపర్‌ యాక్టివ్‌నెస్‌ పిల్లల్లో పెరుగుతుందని తెలిసింది. కొత్తగా వచ్చిన డిజిటల్‌ పొల్యూషన్‌ వల్ల పిల్లల్లో హైపర్‌ టెన్షన్‌ పెరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పేరెంట్స్‌లానే పిల్లలు తయారవుతారు. లేదా రోజువారి సొంత పనులకు పిల్లలు అడ్డు కలిగిస్తున్నారని పిల్లలను ఫోన్లకు అప్పజెపుతుంటారు పేరెంట్స్‌. ఇది సామాన్య విషయం అని అనుకుంటారు. అయితే స్ర్కీన్‌టైమ్‌ ఎక్కువ సమయం చూడటం, వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల పిల్లలు అతిగా స్పందిస్తారు. కోపాన్ని అతిగా ప్రదర్శిస్తారు.
  • పిల్లలను పట్టించుకోకుండా ఉండటం.. దీంతో పాటు ఒక పిల్లవాడిని ముద్దు చేయటం.. ఇంకో కిడ్‌ను పట్టించుకోలేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. నెగ్లెట్‌కి గురైన పిల్లవాడిలో హైపర్‌ యాక్టివ్‌నెస్‌ అధికంగా పెరుగుతుంది. 
  • అమ్మా లేదా నాన్న ఎక్కువ టెన్షన్‌ పడటం, అతిగా కోపానికి గురౌతుంటే.. పిల్లలూ ఆటోమేటిక్‌గా హైపర్‌గా రియాక్టవుతుంటారు. అది కరెక్టే అనుకుంటారు.
  • రెస్ట్‌లెస్‌గా ఆడుకోవడం వల్ల కూడా హైపర్‌ యాక్టివ్‌ లక్షణాలొస్తాయి. 

Updated Date - 2022-08-22T16:31:17+05:30 IST