AP News: ఫేస్ రిక్నగేషన్ యాప్‌ వినియోగానికి ఉపాధ్యాయుల అంగీకారం

ABN , First Publish Date - 2022-09-02T02:19:22+05:30 IST

అమరావతి: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముగిశాయి. ముఖ ఆధారిత హాజరు కోసం యాప్‌ను తమ ఫోన్లల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయులు అంగీకరించారు. అయితే యాప్‌లో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు 15 రోజుల గడువు కోరారు.

AP News: ఫేస్ రిక్నగేషన్ యాప్‌ వినియోగానికి ఉపాధ్యాయుల అంగీకారం

అమరావతి: విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)తో ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముగిశాయి. ముఖ ఆధారిత హాజరు (Face recognition attendance) కోసం యాప్‌ను తమ ఫోన్లల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఉపాధ్యాయులు అంగీకరించారు. అయితే యాప్‌లో సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు 15 రోజుల గడువు కోరారు.


‘‘మా ఫోన్లల్లోనే యాప్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు అంగీకరించాం. అయితే సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు 15 రోజుల సమయం కోరాం. ఆ ఇబ్బందులు తొలగించిన తర్వాతే.. పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలిపాం. 248 ఎంఈవో పోస్టులను ప్రభుత్వ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయబోతున్నారు. 672 ఎంఈఓ పోస్టులను జెడ్పీ టీచర్లతో ఎఫ్ఏసీలుగా భర్తీ చేయనున్నారు. టైమ్ ప్రకారం అటెండెన్స్ వేసినా.. అప్లోడింగులో ప్రాబ్లం ఉంటే.. దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.’’

-సాయి శ్రీనివాస్, ఎస్టీయూ అధ్యక్షుడు


‘‘ఫేస్ రిక్నగేషన్ అటెండెన్సుపై మంత్రితో వివరంగా మాట్లాడాం. మాకు జీతాలతో లింకు పెట్టమని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.

- ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు


‘‘యాప్ వినియోగానికి డివైస్‌లు ఇవ్వాలని కోరాం. అందుకు మంత్రి బొత్స అంగీకరించలేదు. మీ ఫోన్‌లోనే అటెండెన్స్ వేసుకోవాలని చెప్పారు. వ్యక్తిగత డేటాకు ఇబ్బంది వుండదని చెప్పారు. సీపీఎస్ ఉద్యమ కార్యాచరణ‌లో భాగంగా చాలా కేస్‌లు పెట్టారు. వాటిని మాఫీ చేస్తామని మంత్రి చెప్పారు. 

- చెన్నుపాటి మంజుల, ఏపీటిఎఫ్ అధ్యక్షులు 

Updated Date - 2022-09-02T02:19:22+05:30 IST