వాస్తవికతకు దూరంగా సినీ ప్రేమలు

ABN , First Publish Date - 2021-07-26T05:56:56+05:30 IST

సినిమాలు, టివీ సీరియల్స్‌లో చూపించే ప్రేమలు ఉహాజనితమైనవని, వ్యాపార దృక్పథంతో వాటిని నిర్మిస్తారని అవే నిజమైనవని యువతీయువకులు ప్రవర్తిస్తే వారి జీవితాలు దుర్భరమవుతాయని ప్రముఖ విద్యావేత్త, మానసిక నిపుణులు డాక్టర్‌ పద్మ పోతుకూచి పేర్కొన్నారు.

వాస్తవికతకు దూరంగా సినీ ప్రేమలు
జూమ్‌యాప్‌లో మాట్లాడుతున్న డాక్టర్‌ పద్మ

ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ పద్మ 

గుంటూరు (విద్య), జూలై 25: సినిమాలు, టివీ సీరియల్స్‌లో చూపించే ప్రేమలు ఉహాజనితమైనవని, వ్యాపార దృక్పథంతో వాటిని నిర్మిస్తారని అవే నిజమైనవని యువతీయువకులు ప్రవర్తిస్తే వారి జీవితాలు దుర్భరమవుతాయని ప్రముఖ విద్యావేత్త, మానసిక నిపుణులు డాక్టర్‌ పద్మ పోతుకూచి పేర్కొన్నారు. ఆదివారం అరండల్‌పేటలోని స్పందన ఈదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జూమ్‌ యాప్‌ ద్వారా  నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. జీవితంలో సంపూర్ణంగా, సమున్నతంగా ఎదగాలంటే టీనేజి ప్రేమలకు దూరంగా ఉండాలన్నారు. మానసిక పరిపక్వత, యుక్తవయసు వచ్చిన తర్వాతనే వాటి గురించి ఆలోచించాలని సూచించారు. ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఈదా శ్యామ్యూల్‌రెడ్డి మాట్లాడుతూ స్పందన లాంటి బిడ్డల జీవితాలను అర్ధంతరంగా ముగించకూడదనే సదుద్దేశంతో ఫౌండేషన్‌ ద్వారా 16 నెలల పాటు సామాజిక మార్పుకోసం చర్చలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-07-26T05:56:56+05:30 IST