ఎగిరేందుకు సిద్ధమైన పక్షి రెక్కల డ్రోన్

ABN , First Publish Date - 2021-03-04T17:26:19+05:30 IST

బాలీవుడ సినిమా ‘యురి’లో ‘గరుడ డ్రోన్‘ను ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు...

ఎగిరేందుకు సిద్ధమైన పక్షి రెక్కల డ్రోన్

బీజింగ్: బాలీవుడ సినిమా ‘యురి’లో ‘గరుడ డ్రోన్‘ను ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు వినియోగిస్తారు. ఆ సినిమాలో ఒక యువశాస్త్రవేత్త ఇటువంటి డ్రోన్‌ను ఆడుకునేందుకు రూపొందించి, తరువాత సర్జికల్ స్ట్రయిక్స్‌లో సైన్యానికి సహాయపడేలా చేస్తాడు.


సరిగ్గా ఇప్పుడు ఇటువంటి డ్రోన్‌ను చైనాలోని గ్వాంగ్జీ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీర్లు బి-ఈటర్ టెక్నాలజీ సంస్థ సాయంతో తీర్చిదిద్దారు. వీరు గరుడ డ్రోన్ తయారు చేసేందుకు అల్యూమినియం జాయింట్స్‌ను వినియోగించారు. అలాగే త్రీడి ప్రింటెడ్ ప్లాస్టిక్ పార్ట్స్ కూడా వాడారు. ఫ్రేమ్ బయట సహజమైన బాతు రెక్కల ను అమర్చారు. ఫలితంగా ఇది చూసేందుకు అచ్చం గరుడ పక్షిలానే కనిపిస్తుంది. అయితే ఈ గరుడ డ్రోన్‌కు సంబంధించిన పూర్తి విషయాలను గ్వాంగ్జీ విశ్వవిద్యాలయం బయటకు వెల్లడించలేదు.

Updated Date - 2021-03-04T17:26:19+05:30 IST