ఎంసెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

Published: Fri, 22 Oct 2021 19:41:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎంసెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేసారు. ఈ నెల 25 నుంచి తుది విడత అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. నవంబర్ 2న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీట్ల రద్దుకు నవంబర్ 7 వరకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌కి అవకాశం కల్పించారు. నవంబర్ 9 నుంచి స్పెషల్ రౌండ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 12న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. నవంబర్ 15 లోపు సీటు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీలో ఆన్లైన్ రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.