మునుగోడు రాజకీయం గరంగరం

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక అంశం రోజురోజుకూ వేడెక్కుతోంది. బహిరంగ సభతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బోణీ చేయగా, ఈనెల 21 చౌటుప్పల్‌లో భారీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు ప్రారంభించారు. ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌కు తెరలేపిం ది.

మునుగోడు రాజకీయం గరంగరం

సభతో బోణీ చేసిన కాంగ్రెస్‌

21న బీజేపీలోకి రాజగోపాల్‌, భారీ సభ, చేరికలు 

టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌


నల్లగొండ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నిక అంశం రోజురోజుకూ వేడెక్కుతోంది. బహిరంగ సభతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బోణీ చేయగా, ఈనెల 21 చౌటుప్పల్‌లో భారీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు ప్రారంభించారు. ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌కు తెరలేపిం ది. హుజూరాబాద్‌లో హడావుడి చేసి బోర్లాపడ్డ అనుభవంతో స్థానికంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మంత్రి జగదీ్‌షరెడ్డి మూడు నెలలగా ఈ ఏర్పా ట్లు గుంభనంగా చేసుకుంటూ వస్తున్నారు. నేడో, రేపో తెరవెనుక టీఆర్‌ఎస్‌ చేసిన ప్రయత్నాలు బహిరంగం కానున్నాయి.


21న చౌటుప్పల్‌లో బీజేపీ సభ

అనుకున్నట్టుగానే ఈ నెల మొదటివారంలోనే రాజీనా మా ప్రకటన చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికకు సంబంధించి చకచకా పనులు ప్రారంభించారు. ఇప్ప టివరకు డైలమాలో ఉండటం, కాంగ్రెస్‌ శ్రేణులు గంపగుత్తగా వస్తాయా అనే సందేహాల నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకే రాజగోపాల్‌రెడ్డి నిశ్చయించుకున్నారు. కాంగ్రెస్‌ కు రాజీనామా చేస్తూ అధ్యక్షురాలు సోనియాకు లేఖ పంపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి స్పీకర్‌ ఫార్మెట్‌లో కాగితాలు సిద్ధం చేసుకు న్నా స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ అయి, ఈనెల 21న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చౌటుప్పల్‌లో 3లక్షల మందితో సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు రాజగోపాల్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎ్‌సల నుం చి భారీగా చేరికలు ఉండనున్నాయి. ఈనెల 7న చండూరులో ఆయన పర్యటించనున్నారు.


ఉత్సాహం నింపిన సభ

కాంగ్రె్‌సకు బలమైన నియోజకవర్గంగా ఉన్న మునుగోడులో పట్టునిలుపుకునేందుకు శుక్రవారం నిర్వహించిన సభ విజయవంతం కావడం ఆ పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాజగోపాల్‌ రాజీనామాతో పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్న అంచనాలో ఉండగా, వాటిని బ్రేక్‌ చేస్తూ సభ జరిగింది. ఉప ఎన్నికలో గెలుపుకోసం ఊరూరా తిరుగుతానని, ప్రతీ యువకుడిని కలుస్తానని రేవంత్‌ ప్రకటించారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి అందుబాటులోకి రావడం కష్టకాలంలో ఉన్న కాంగ్రె్‌సకు ఊరటనిచ్చింది. కొద్ది రోజుల్లోనే ఐదుగురు సభ్యులతో కూడిన వ్యూహ, ప్రచార కమిటీ నియోజకవర్గంలో మకాం వేయనుంది. దీంతో రోజురోజుకూ ఉప ఎన్నిక వేడి పెరుగుతోంది.


టీఆర్‌ఎస్‌ సైలంట్‌ ఆపరేషన్‌

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నిక తెస్తాడ న్న సమాచారం అధికార టీఆర్‌ఎ్‌సకు ఆరునెలల మందునుంచే ఉంది. ఈ క్రమంలోనే ఆయన కదలికలపై టీఆర్‌ఎస్‌ నిఘా పెట్టింది. తనకు సూర్యాపేట ఎంతో మునుగోడు అంతే అంటూ స్థానికంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వ్యవహారాన్ని మంత్రి జగదీ్‌షరెడ్డి తన చేతిలోకి తీసుకున్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ, దళితబంధు పథకం ప్రచారం వంటి కార్యక్రమాలకు స్వయంగా మం త్రి హాజరయ్యారు. మరో వైపు నియోజకవర్గంలో ఉన్న గ్రూపు తగాదాలను దారికి తెచ్చేందుకు పని ప్రా రంభించారు. అన్ని మండలాల అధ్యక్షులు, కీలక ప్రజాప్రతినిధులతో మంత్రి నేరుగా సంబంధాలు ఏర్పరుచుకొని కాం గ్రెస్‌ నుంచి పెద్ద సంఖ్యలో వలసలను ప్రోత్సహించారు. ఒక వైపు ప్రభుత్వ యంత్రాంగం, మరో వైపు పార్టీ వ్యవ స్థ తన నియంత్రణలోకి వచ్చేలా పనిచేశారు. అక్కడ పేరుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయినా, వ్యవహారమంతా అధికార టీఆర్‌ఎ్‌సదే అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పరిణామాలు మింగుడుపడని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పలు వేదికలపై మంత్రి జగదీ్‌షరెడ్డిని టార్గెట్‌ చేశా రు. చౌటుప్పల్‌ సమావేశంలో మంత్రి చేతిలోంచి ఎమ్మె ల్యే రాజగోపాల్‌రెడ్డి మైక్‌ లాక్కోవడం వివాదస్పదమైంది. రాజగోపాల్‌ రాజీనామా ఖరారైనా, ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి ప్రకటనలు లేకుండా వ్యూహాత్మక మౌనం పాటించారు. ఓవైపు పార్టీ, ఇతర పార్టీల బలాబలాలు, అభ్యర్థి ఎవరైతే మంచిది, ఎదుటి అభ్యర్థులు ఎవ రు, వారి బలాలు, బలహీనతలపై సర్వేలు, ఫ్లాష్‌ సర్వేలు చేసుకుంటూ గట్టుప్పల్‌ మండల ప్రకటన చేసి సైలంట్‌ గా ఉన్నారు. కొన్ని నెలలుగా మంత్రి జగదీ్‌షరెడ్డి చేసిన  ప్రయత్నాలు నేడో, రేపో బహిర్గతం కానున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్‌ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా మాట్లాడినా, మునుగోడు గురించి మాట మాత్రంగానైనా ఉచ్ఛరించకపోవడం ఆ పార్టీ సైలెంట్‌ ఆపరేషన్‌ను స్పష్టం చేస్తోంది.

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST