జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-25T05:31:11+05:30 IST

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబురాలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి దసరా పండుగకు ముందు వచ్చే అమావాస్య నుంచి ప్రారంభమయ్యే ఈ వే డుకలను జిల్లాలో వైభవంగా జరుపనున్నారు. మ హిళలంతా ఒక్కచోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సంప్రదాయ రీతి లో వేడుకలను జరుపుకోనున్నారు.

జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
బతుకమ్మను ఎత్తుకున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

పాల్గొన్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 24: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ సంబురాలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి దసరా పండుగకు ముందు వచ్చే అమావాస్య నుంచి ప్రారంభమయ్యే ఈ వే డుకలను జిల్లాలో వైభవంగా జరుపనున్నారు. మ హిళలంతా ఒక్కచోట చేరి రంగురంగుల పూలతో బతుకమ్మలను ముస్తాబు చేసి సంప్రదాయ రీతి లో వేడుకలను జరుపుకోనున్నారు. ఇదిలా ఉంటే   జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్‌లో కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. వారితో కలిసి ఉత్సాహాంగా గడుపుతూ బతుకమ్మ సంబురాల్లో భాగస్వామ్యులు కావడంతో కోలాహాల వాతా వర ణం కనిపించింది. చిన్నారులు తమచిట్టి చేతులతో బతుకమ్మలను తీసుకురాగా.. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి వేడుకలను ఘనంగా జరిపారు. తీరొక్క పువ్వులతో అందంగా బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ బతుకమ్మను మధ్యలో ఉంచి  కోలాటాలు, నృత్యాలు చేసి సంబురంగా ఆడి పా డారు. అలాగే, జిల్లాలోని బేల, నేరడిగొండ, తాంసి, మావలతో పాటు ఆయా మండలాల్లో బతుకమ్మ సంబంరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Updated Date - 2022-09-25T05:31:11+05:30 IST