జిల్లాలో అకాలవర్షం

ABN , First Publish Date - 2021-05-09T06:19:07+05:30 IST

నిర్మల్‌ జిల్లా లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరు ములు, మెరుపులతో కూడిన వానపడింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో.. ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు.

జిల్లాలో అకాలవర్షం
సారంగపూర్‌ మండలంలో తడిసిన ధాన్యం

నిర్మల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లా లోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు, ఉరు ములు, మెరుపులతో కూడిన వానపడింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో.. ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడ్డారు. మామడ, సారంగపూర్‌లలో ధాన్యం నిల్వలు తడిసి ముద్దయ్యాయి. 

తడిసిన ధాన్యం

సారంగాపూర్‌, మే 8 : మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం రాత్రి అకాల వర్షం కురియడంతో మార్కెట్‌లో ఉన్నటువంటి వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం విక్రయించే సమయంలోనే అకాల వర్షం కురి యడంతో వరి ధాన్యం తడిసి పోవడంతో పెట్టిన పెట్టుబడి రాదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్క రైతుకు సుమారు రూ. లక్ష నుండి 2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు పేర్కొం టున్నారు. ఇప్పటికైనా అకాల వర్షానికి నష్ట పోయిన ధాన్యం రైతులను ప్రభుత్వం ఆదు కోవాలని కోరుతున్నారు.  

Updated Date - 2021-05-09T06:19:07+05:30 IST