Earthquake Hits Afghanistan: ఫైజాబాద్‌ను వణికించిన భూకంపం

ABN , First Publish Date - 2022-08-05T13:13:24+05:30 IST

అఫ్ఘానిస్థాన్(Afghanistan) దేశంలో ఫైజాబాద్ నగరంలో భూకంపం సంభవించింది(Earthquake....

Earthquake Hits Afghanistan: ఫైజాబాద్‌ను వణికించిన భూకంపం

కాబూల్(అఫ్ఘానిస్థాన్): అఫ్ఘానిస్థాన్(Afghanistan) దేశంలో ఫైజాబాద్ నగరంలో భూకంపం సంభవించింది(Earthquake Hits Afghanistan). తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం(Earthquake) ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) ట్వీట్(tweeted) చేసింది.150 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో ఫైజాబాద్(Fayzabad) ప్రజలు భయంతో వణికిపోయారు.ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. భూమి కంపించడంతో ప్రజలు భయకంపితులై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 



విపత్తులతో అఫ్ఘానిస్థాన్ సతమతం

జూన్ నెల 22వతేదీన కాబూల్ నగరంలో సంభవించిన భూకంపం వల్ల బార్మల్,గియాన్ జిల్లాల్లోని 1000 మంది మరణించారు. అప్పటి భూకంపం ప్రభావం వల్ల 1455 మంది గాయపడ్డారు. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక అప్ఘానిస్థాన్ దేశంలో నెలకొన్న ఆర్థికసంక్షోభానికి తోడు తరచూ భూకంపం లాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. భూకంపంతో నష్టపోయిన అప్ఘాన్ ప్రజలకు భారతదేశంతో పాటు రాయల్ హుమానిటేరియన్ ఫౌండేషన్, యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ సంస్థలు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాయి.  

Updated Date - 2022-08-05T13:13:24+05:30 IST