Andaman and Nicobar: కాంపబెల్ పట్టణాన్ని వణికించిన భూకంపం

ABN , First Publish Date - 2022-09-24T15:49:16+05:30 IST

అండమాన్ నికోబార్ దీవుల్లో(Andaman and Nicobar) శనివారం భూకంపం(earthquake) సంభవించింది.

Andaman and Nicobar: కాంపబెల్ పట్టణాన్ని వణికించిన భూకంపం

కాంపబెల్: అండమాన్ నికోబార్ దీవుల్లో(Andaman and Nicobar) శనివారం భూకంపం(earthquake) సంభవించింది. దీవుల్లోని కాంపబెల్ ప్రాంతంలో సంభవించిన భూకంపం స్థానిక ప్రజలను వణికించింది.ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. కాంపబెల్ తీరాన్ని(Campbell Bay) వణికించిన భూకంపం 75కిలోమీటర్ల లోతులో వచ్చిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.

Updated Date - 2022-09-24T15:49:16+05:30 IST