earthquake : రాజస్థాన్‌ వాసులను వణికించిన భూకంపం

ABN , First Publish Date - 2022-08-22T13:01:39+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ సమీపంలో( Rajasthans Bikaner) సోమవారం సంభవించిన భూకంపం(earthquake) స్థానిక ప్రజలను వణికించింది....

earthquake : రాజస్థాన్‌ వాసులను వణికించిన భూకంపం

బికనేర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ సమీపంలో( Rajasthans Bikaner) సోమవారం సంభవించిన భూకంపం(earthquake) స్థానిక ప్రజలను వణికించింది. బికనేర్ సమీపంలోని ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 2.01 గంటలకు సంభవించిన భూకంపంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.బికనేర్ నగరానికి 236 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున సంభవించిన భూకంపంతో గాఢనిద్రలో ఉన్న ప్రజలు లేచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బికనేర్ అధికారులు చెప్పారు. 


శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం (Uttar Pradesh)లక్నో సమీపంలో 82 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.శుక్రవారం కూడా ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని పిఠోరాగడ్ ప్రాంతంలో భూమి కంపించింది. అంతకుముందు జమ్మూకశ్మీరులోనూ(Jammu & Kashmir) భూకంపం సంభవించింది. దేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్, రాజస్థాన్  ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో ఈ ప్రాంతాల ప్రజలు తీవ్రంగా భయాందోళనలు చెందారు. వరుస భూప్రకంపనలు పెద్ద భూకంపం వచ్చేందుకు ముందస్తు హెచ్చరికగా కొందరు అనుమానిస్తున్నారు.  


Updated Date - 2022-08-22T13:01:39+05:30 IST