Kathmanduలో భూకంపం...ప్రజల భయాందోళనలు

ABN , First Publish Date - 2022-06-11T16:37:50+05:30 IST

నేపాల్ దేశంలోని కాట్మాండు (Kathmandu)నగరంలో శనివారం భూకంపం సంభవించింది....

Kathmanduలో భూకంపం...ప్రజల భయాందోళనలు

కాట్మాండు: నేపాల్ దేశంలోని కాట్మాండు (Kathmandu)నగరంలో శనివారం భూకంపం సంభవించింది.నేపాల్ దేశ రాజధాని నగరమైన కాట్మాండుకు తూర్పున 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.శనివారం తెల్లవారుజామున కాట్మాండులో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7 గా నమోదైంది. భూకంపం సంభవించినపుడు నిద్రలోఉన్న ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూకంపం శనివారం తెల్లవారుజామున 2.36 గంటలకు సంభవించిందని అధికారులు చెప్పారు.భక్తపూర్ జిల్లా భూకంప కేంద్రంగా అధికారులు గుర్తించారు.కాట్మాండులో గతంలో ఘోర భూకంపం సంభవించిన దృష్ట్యా భూప్రకంపనలతో తీవ్రంగా భయపడ్డారు. ఇళ్లలో నిద్రపోతున్న వారు రోడ్లపైకి పరుగులు పెట్టారు. 


Updated Date - 2022-06-11T16:37:50+05:30 IST