అలస్కాలో భూకంపం..!

ABN , First Publish Date - 2021-02-28T15:05:33+05:30 IST

అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది.

అలస్కాలో భూకంపం..!

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదు 

అలస్కా: అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శనివారం ఉదయం 10 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. అలస్కాలోని పాయింట్ మాకెంజీలో 5.3 తీవ్రతతో భూమి కంపించింది. రాష్ట్రంలో వేలాది మంది దీనిని అనుభవించారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వేకు సుమారు 2,794 మంది 'ఫీల్డ్ రిపోర్ట్' దాఖలు చేశారు. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, 2018లో అంకరెజ్ పట్టణంలో రిక్టర్​ స్కేలుపై 7.1 తీవ్రతతో వచ్చిన భూకంప ధాటికి తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-02-28T15:05:33+05:30 IST