యువత సమస్యలపై డీవైఎఫ్‌ఐ పోరాటం

Published: Wed, 10 Aug 2022 00:52:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
యువత సమస్యలపై డీవైఎఫ్‌ఐ పోరాటంపోస్టర్‌ ను ఆవిష్కరిస్తున్న డీవైఎఫ్‌ఐ నేతలు

యువత సమస్యలపై డీవైఎఫ్‌ఐ పోరాటం

రాణిగారితోట, ఆగస్టు 9: యువజనాభివృద్ధి, యువత  సమస్యలపై డీవైఎఫ్‌ఐ నిర్విరా మంగా పోరాటం చేస్తుందని తూర్పు కార్యదర్శి పి.కృష్ణ అన్నారు. ఈ నెల 14న జరగనున్న తూర్పు నియోజకవర్గ మహాసభ పోస్టర్‌ను స్థానిక సుందరయ్య గ్రంథాలయం వద్ద మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, దశల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మన్నారు. ఈ నెల 14న రాణిగారితోటలోని సీఐటీయూ మీటింగ్‌ హాల్‌లో  మహాసభ జరుగుతుందని, తూర్పులోని అన్ని డివిజన్‌ల నుంచి యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తూర్పు నగర అధ్యక్షుడు చుక్కా శ్రీకాంత్‌, ఆర్‌.రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.