సీపీఆర్‌తో ప్రాణం కాపాడొచ్చు

ABN , First Publish Date - 2021-11-29T05:56:01+05:30 IST

కాకినాడ క్రైం, నవంబరు 28: గుండెపోటు, ప్రాణాంత సమయంలో కుప్పకూలిన వ్యక్తిని సీపీఆర్‌ విధానంతో కాపాడవచ్చని, ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు కోరారు. కాకినాడ పోలీస్‌ కన్వెన్షన్‌ హల్లో జిల్లా ఆర్మ్‌ రిజర్వు పోలీసు అధికారులు, ఏఎన్‌ఎస్‌ సిబ్బందికి ఫస్ట్‌ ఎయిడ్‌, కార్డియో పల్మనరీ రెసిసిటేషన్‌ (సీపీఆర్‌)పై అవగాహన సదస్సు ప్రారంభించారు. గుండె నొప్పి, పాము

సీపీఆర్‌తో ప్రాణం కాపాడొచ్చు
కాకినాడలో డెమో గుండెపై ఒత్తిడి కలిగిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు 

కాకినాడ క్రైం, నవంబరు 28: గుండెపోటు, ప్రాణాంత సమయంలో కుప్పకూలిన వ్యక్తిని సీపీఆర్‌ విధానంతో కాపాడవచ్చని, ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు కోరారు. కాకినాడ పోలీస్‌ కన్వెన్షన్‌ హల్లో జిల్లా ఆర్మ్‌ రిజర్వు పోలీసు అధికారులు, ఏఎన్‌ఎస్‌ సిబ్బందికి ఫస్ట్‌ ఎయిడ్‌, కార్డియో పల్మనరీ రెసిసిటేషన్‌ (సీపీఆర్‌)పై అవగాహన సదస్సు ప్రారంభించారు. గుండె నొప్పి, పాముకాటు, పక్షవాతం, విద్యుత్‌ షాక్‌కు గురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై జీజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌, సీపీఆర్‌ రీసోర్సు పర్సన్‌ డాక్టర్‌ యు.సుధీర్‌ అవగాహన కల్పించారు. గుండెపై ఒక క్రమ పద్ధతిలో ఒత్తిడి కలిగించేలా చేసే పద్ధతినే సీపీఆర్‌ అంటారన్నారు. గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని కదపడం చేయరాదని, సమతలంగా నేలపై పడుకోబెట్టి, ఛాతి ఎముక కింద రెండు చేతులు ఉంచి ఒకటి నుంచి రెండు అంగుళాల కిందకి నొక్కుతూ 80 నుంచి 100 సార్లు నొక్కడం ద్వారా శరీరంలోకి రక్తం, గాలిని ప్రవహింపచేసి ప్రాణాన్ని కాపాడవచ్చని పేర్కొన్నారు. అడిషనల్‌ ఎస్పీ కె. కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ అప్పారావు, యూనిట్‌ డాక్టర్‌ ఎం.నూకరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-29T05:56:01+05:30 IST