80 శాతం రబీ వరికోతలు పూర్తి

ABN , First Publish Date - 2021-05-09T05:45:55+05:30 IST

సామర్లకోట, మే 8: జిల్లాలో రబీ వరికోతల్లో భాగంగా 4,04,301 ఎకరాల్లో వరికోతలు, మాసూళ్లు చేపట్టం ద్వారా 82శాతం కోతలు, మాసూళ్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు వీటీ.రామారావు వెల్లడించారు. శనివారం సామర్లకోట వ్యవసాయ పరిశోధనాకేంద్రంలో ఆయ మాట్లాడుతూ జిల్లాలో రబీ వరిసాగును 4,04,080 ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా అంతకుమించి 4,39,856 ఎకరాల్లో సా

80 శాతం రబీ వరికోతలు పూర్తి

సామర్లకోట, మే 8: జిల్లాలో రబీ వరికోతల్లో భాగంగా 4,04,301 ఎకరాల్లో వరికోతలు, మాసూళ్లు చేపట్టం ద్వారా 82శాతం కోతలు, మాసూళ్లు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు వీటీ.రామారావు వెల్లడించారు. శనివారం సామర్లకోట వ్యవసాయ పరిశోధనాకేంద్రంలో ఆయ మాట్లాడుతూ జిల్లాలో రబీ వరిసాగును 4,04,080 ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా అంతకుమించి 4,39,856 ఎకరాల్లో సాగు చేశారన్నారు. జిల్లాలో పంటకోతలు త్వరితగతిన పూర్తిచేసేందుకు 611 వరికోత యంత్రాలు రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు కారణంగా రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం రాశులను వర్షం నుంచి కాపాడుకునేందుకు రక్షణ బరకాలను అందుబాటులోకి ఉంచుకోవాలని రైతులకు జేడీఏ సూచించారు. సమావేశంలో ట్రైనింగ్‌ డీడీ మాధవరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-09T05:45:55+05:30 IST