తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి

ABN , First Publish Date - 2021-12-07T18:39:40+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి చూపుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్ల అనాసక్తి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల మరమ్మతుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్నారు. రూ.200 కోట్ల పాత బకాయిలు చెల్లించాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్తపనులు చేస్తామని తేల్చిచెప్పారు. 4 సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి. దీంతో రోడ్డుభవనాల శాఖ అధికారులు మరోసారి గడువు పెంచారు.  457 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతుల కోసం రూ.119 కోట్లు, 159 కిలోమీటర్లకు రూ.79 కోట్లతో ఐదోసారి టెండర్లకు అధికారులు ఆహ్వానం పంపారు. 

Updated Date - 2021-12-07T18:39:40+05:30 IST