అందుబాటులోకి డివిజన్‌ స్థాయి కాల్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2021-05-15T05:38:10+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 14: మరింత పటిష్టమైన కొవిడ్‌ నియంత్రణ, ఆసుపత్రులు, కేర్‌ సెంటర్ల్ల నిర్వహణ, టెస్టింగ్‌, హోం ఐసోలేషన్‌, వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ సరఫరా వంటి అంశాల నిశిత పర్యవేక్షణ కోసం జిల్లా కాల్‌ సెం టర్‌కు అనుబంధంగా డివిజన్‌ స్థాయి కాల్‌ సెంటర్లు

అందుబాటులోకి డివిజన్‌ స్థాయి కాల్‌ సెంటర్లు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 14: మరింత పటిష్టమైన కొవిడ్‌ నియంత్రణ, ఆసుపత్రులు, కేర్‌ సెంటర్ల్ల నిర్వహణ, టెస్టింగ్‌, హోం ఐసోలేషన్‌, వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ సరఫరా వంటి అంశాల నిశిత పర్యవేక్షణ కోసం జిల్లా కాల్‌ సెం టర్‌కు అనుబంధంగా డివిజన్‌ స్థాయి కాల్‌ సెంటర్లు అందబాటులోకి తేవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవార ం మధ్యాహ్నం ఐటీడీఏ పీవోలు, సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్య అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ కాల్‌ సెంటర్‌ సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అందించేందుకు డివిజన్ల స్థాయిలో కాల్‌ సెంటర్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం మున్సిపాలిటీలలో ఇటువంటి సెంటర్లు ఏర్పాటు కాగా జిల్లాలోని అన్ని డివిజన్‌ కేంద్రాల్లో అనుబంధ కాల్‌ సెం టర్లు శనివారం నుంచి ఏర్పాటు చేయాలని సూచించారు.

Updated Date - 2021-05-15T05:38:10+05:30 IST