రాజమండ్రిలో కిచిడీ చేప.. ధర 2.60 లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే..

ABN , First Publish Date - 2021-10-31T18:18:04+05:30 IST

తూ.గో.జిల్లా: ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన కిచిడి అనే చేప ఏకంగా రూ. 2 లక్షల 60 వేల ధర పలికింది.

రాజమండ్రిలో కిచిడీ చేప.. ధర 2.60 లక్షలు.. ప్రత్యేకత ఏంటంటే..

రాజమహేంద్రవరం: మామూలుగా అయితే చేప ధర ఎంత ఉంటుంది? పులస చేప అయితే రూ. 4వేలు ఉంటుంది. కానీ ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన కిచిడి అనే చేప ఏకంగా రూ. 2 లక్షల 60 వేల ధర పలికింది. అయితే మత్స్యకారుడికి దొరికిన ఆ చేపలో ఔషధ గుణాలుండడమే అంత ధర పలకడానికి అసలు కారణంగా తెలిసింది.


తూర్పు గోదావరి జిల్లా, సకినేటిపల్లి మండలం, అంతర్వేది చేపల మార్కెట్‌లో కిచిడి చేప అధిక ధర పలికి అందరినీ ఆశ్చర్చానికి గురిచేసింది. అంతర్వేది సాగర సంగమం వద్ద స్థానిక మత్స్యకారులు వేటకు వెళ్లగా 21 కిలోల చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దాన్ని మార్కెట్‌లో విక్రయించగా రూ. 2 లక్షల 60వేల ధర పలికింది. ఈ చేప పొట్ట భాగాన్ని ఆపరేషన్లలో కుట్లు వేయడానికి వాడే దారం తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాదు ఆపరేషన్లలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారని స్థానికులు చెబుతున్నారు. దీన్ని చైనాకు ఎగుమతి చేయనున్నట్లు కొనుగోలు దారులు తెలిపారు.

Updated Date - 2021-10-31T18:18:04+05:30 IST