రాజమండ్రి: ఎమ్మెల్యే రాపాక గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు..
ABN , First Publish Date - 2021-12-06T19:08:51+05:30 IST
ఎమ్మెల్యే రాపాక గో బ్యాక్ అంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రాజమండ్రి: రాజోలు మండలం, కాట్రేనిపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు రావద్దంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే రాపాక గో బ్యాక్ అంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కాట్రేనిపాడు గ్రామానికి చేరుకున్న పోలీసులు ఫ్లెక్సీలు తొలగించారు. జనసేనలో గెలచి పార్టీకి ఎమ్మెల్యే ద్రోహం చేసారంటూ జనసేన కార్యకర్తలు నిలదీసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని జనసేన కార్యకర్తలతో చర్చలు జరిపి నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు.