స్పెషల్‌ డ్రైవ్‌లో దొరికేశారు!

ABN , First Publish Date - 2022-05-24T07:01:31+05:30 IST

రాజమహేంద్రవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): నగరంలో అల్లరచిల్లరగా తిరుగున్న యువతపై పోలీసులు నిఘా పెట్టారు. గడిచిన శని, ఆదివారాల్లో జిల్లావ్యాప్తంగాను, ముఖ్యంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో అనేకమంది దొరికేశారు. వారిపై కేసులు పెట్టడంతోపాటు, వాహనాలు సీజ్‌ చేశారు. కొందరికి ఫైన్‌ కూడా వేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పలువురు మద్యం బాబులపై కూడా కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి కథనం ప్రకారం ఈనెల 21, 22వ తేదీల్లో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారిపై 364 కేసులు న

స్పెషల్‌ డ్రైవ్‌లో దొరికేశారు!
డ్రంకెన్‌ డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు చేస్తున్న రాజమహేంద్రవరం పోలీసులు

364 ట్రిపుల్‌ రైడింగ్‌  కేసులు 

డ్రైవింగ్‌లో నిబంధనలు పాటించని యువతపై 44 కేసులు

వాహనాలు సీజ్‌  8 డ్రంకెన్‌ డ్రైవ్‌లో 31 కేసులు

200 శాతం ఆల్కహాల్‌కు మించితే జైలుకే

జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి


రాజమహేంద్రవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): నగరంలో అల్లరచిల్లరగా తిరుగున్న యువతపై పోలీసులు నిఘా పెట్టారు. గడిచిన శని, ఆదివారాల్లో జిల్లావ్యాప్తంగాను, ముఖ్యంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో అనేకమంది దొరికేశారు. వారిపై కేసులు పెట్టడంతోపాటు, వాహనాలు సీజ్‌ చేశారు. కొందరికి ఫైన్‌ కూడా వేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పలువురు మద్యం బాబులపై కూడా కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి కథనం ప్రకారం ఈనెల 21, 22వ తేదీల్లో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారిపై 364 కేసులు నమోదుచేశామని, వారి నుంచి 1,79,600 అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపేవారిపైనా, డేంజరస్‌ డ్రైవింగ్‌పైనా, రికార్డులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న యువకులపై 44 కేసులు పెట్టి, వాహనాలు సీజ్‌ చేసినట్టు చెప్పారు. అలాగూ మద్యం సేవించిన వాహనదారులపై 31 కేసులు నమోదు చేశామన్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఆల్కహాల్‌ 200 శాతం కంటే ఎక్కువ తాగినట్టు తేలితే నేరుగా జైలుకే పంపిస్తామన్నారు మిగతావారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే 170 మంది వ్యక్తులను గుర్తించి వారిపై ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. నగరంలో అల్లరచిల్లరగా తిరిగే యువతను దృష్టిలో పెట్టుకునే ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామన్నారు. అందరూ నిబంధనలు పాటించాలని, రాంగ్‌ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవడంతోపాటు, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టవద్ద ని ఆయన హెచ్చరించారు. కొందరు యువకులు ఒకే బైక్‌పై నలుగురు కూడా వెళుతున్నారని, పిల్లలు కూడా బైక్‌లు నడిపేస్తున్నారని, అనేకమంది తాగి వాహనాలు నడుపుతున్నారన్నారు. కొందరు డేంజరస్‌ డ్రైవింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారని, ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-05-24T07:01:31+05:30 IST