ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-03-03T07:00:11+05:30 IST

తుని, మార్చి 2: మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ కోరారు. మంగళవారం

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి
తుని రూరల్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభిస్తున్న ఎస్పీ

ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ

తుని, మార్చి 2: మున్సిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ కోరారు. మంగళవారం ఆయన మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల, పోలీసు సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తునిలో 30 వార్డులకుగాను 11 సమస్యాత్మక, 12 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులతో చర్చించామన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగే చర్యలకు పాల్పడకూడదన్నారు. సమావేశంలో డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్‌, పట్టణ సీఐ రమే్‌షబాబు, రూరల్‌ సీఐ కిషోర్‌బాబు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ ప్రారంభం

తుని రూరల్‌: తుని జాతీయ రహదారిని ఆనుకుని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసీన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పరీశీలించారు. తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించారు. వీటి ఏర్పాటులో భాగస్వాములైన దాతలను అభినందించారు. రూరల్‌ పోలీసులతో కలిసి గ్రామ పోలీసులకు సర్టిఫికెట్లు అందజేశారు. రూరల్‌ సీఐ కె.కిషోర్‌బాబు, ఎస్‌ఐలు గణే్‌షకుమార్‌,అశోక్‌, విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T07:00:11+05:30 IST