గూగుల్‌ క్రోమ్‌ సులువుగా స్ర్కీన్‌షాట్‌

Published: Sat, 14 May 2022 03:11:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గూగుల్‌ క్రోమ్‌ సులువుగా స్ర్కీన్‌షాట్‌

తమ వినియోగదారులు సులువుగా స్ర్కీన్‌షాట్స్‌ తీసుకునేందుకు గూగుల్‌ క్రోమ్‌ కృషి చేస్తున్నట్టు సమాచారం. విండోస్‌ లేటెస్ట్‌ నివేదిక ప్రకారం బ్రౌజర్‌లోని ఈ సరికొత్త టూల్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. దీంతో బ్రౌజర్‌ను విడిచిపెట్టకుండానే స్ర్కీన్‌షాట్‌ను యూజర్లు పొందవచ్చు. ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఇప్పటికే ఈ వెసులుబాటు ఉంది. సరిగ్గా అటువంటి సదుపాయాన్ని విండోస్‌11, విండోస్‌10, మేక్‌ ఓఎస్‌, క్రోమ్‌ ఓఎస్‌పై క్రోమ్‌ బ్రౌజర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ వెబ్‌ క్యాప్చర్‌ టూల్‌ని మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ఆఫర్‌ చేసింది. బ్రౌజర్‌లో ఒక మేర క్యాప్చర్‌ చేసేందుకు అలాగే క్లిప్‌బోర్డ్‌కు ఇమేజ్‌ కాపీ చేసేందుకు, ఎడిటింగ్‌కు ఈ టూల్‌ వినియోగదారుల్ని అనుమతిస్తుంది.  దీన్ని విండోస్‌ లింకింగ్‌ ఫీచర్‌గానే ఉపయోగించుకోవాలి. అందులో పలు ఎడిటింగ్‌ ఆప్షన్లు ఉన్నాయి.


ఈ కొత్త స్ర్కీన్‌షాట్‌ టూల్‌ కావాలనుకుంటే..

  • క్రోమ్‌ కేనరీ లేదా క్రోమియమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  •  అడ్రస్‌ బార్‌ ద్వారా క్రోమ్‌లో chrome://flags విజిట్‌ చేయాలి.
  • ‘డెస్క్‌టాప్‌ స్ర్కీన్‌షాట్స్‌’, ‘డెస్క్‌టాప్‌ స్ర్కీన్‌షాట్‌ ఎడిట్‌ మోడ్స్‌’ ఫ్లాగ్స్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలి.
  • బ్రౌజర్‌ను రీలాంచ్‌ చేసుకోవాలి.  
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.