వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-03-09T05:17:03+05:30 IST

వ్యాసరచన పోటీల్లో ముదిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని సౌజన్య జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్‌ వాసిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.

వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
కలెక్టర్‌ నుంచి బహుమతి అందుకుంటున్న సౌజన్య

ముదిగొండ/కారేపల్లి మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా సోమవారం ఖమ్మంలో మహిళా అభివృద్ధి శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ముదిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని సౌజన్య జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించినట్లు ప్రిన్సిపాల్‌ వాసిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ చేతులమీదుగా సౌజన్యకు బహుమతి అందజేసినట్లు తెలిపారు. విద్యార్థిని సౌజన్య ప్రథమ బహుమతి సాధించటం పట్ల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు అభినందించారు.

కారేపల్లి విద్యార్థినికి ద్వితీయ బహుమతి

కారేపల్లి: జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా స్థానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదర్శవంతమైనా మహిళా నాయకురాలు అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు.పోటీలలో కారేపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన  బాణోత్‌ హేమలత అనే విద్యార్ధి గెలుపొందింది. కలెక్టర్‌ ఆర్‌.వీ కర్ణన్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి చేతుల మీదగా బహుమతి అందుకున్నారు. విద్యార్థిని కళాశాల సిబ్బంది అభినందించారు.




Updated Date - 2021-03-09T05:17:03+05:30 IST